Kiran Abbavaram: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు కిరణ్ అబ్బవరం ఒకరు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఒక శుభవార్తను తెలియజేశారు. ఈయన త్వరలోనే తండ్రి కాబోతున్నట్టు ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు.
నటుడు కిరణ్ అబ్బవరం భార్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే తన భార్య బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ… మా ప్రేమ రెండు అడుగుల మేర పెరిగింది అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎంతోమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా రాజావారు రాణి గారు సినిమా హీరోయిన్ రహస్యను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో అప్పటినుంచి ప్రేమలో ఉన్నట్టు కిరణ్ అబ్బవరం ఇటీవల తెలియజేశారు. ఐదు సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న ఈ జంట గత ఏడాది ఆగస్టు నెలలో పెద్దల సమక్షంలోను అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.. ఇలా వీరి వివాహం జరిగిన కొద్ది రోజులకే ఈ జంట శుభ వార్తను తెలియజేశారు.
ఇలా కిరణ్ అబ్బవరం భార్య నటి రహస్య తల్లి కాబోతున్న విషయం తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రహస్య తన జీవితానికి లక్కీ అంటూ ఇటీవల కిరణ్ అబ్బవరం తెలియజేశారు. ఈయన వివాహం జరిగిన తర్వాత క అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటివరకు సరైన హిట్ కొట్టని కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారని చెప్పాలి.