Star Actress: రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్… కొత్త సంవత్సరం వేల గుడ్ న్యూస్?

Star Actress: కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఎంతోమంది సినిమా తారలు గత ఏడాది వారికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి ఇలియానా సైతం గత ఏడాది తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో భాగంగా అనే ఆమె మరోసారి తల్లి కాబోతున్నట్లు కూడా తెలిపారు.

ఇలియానా సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఇలా తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె ప్రేమలో పడటం జరిగింది. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఇలియానా ఎవరికి తెలియకుండా తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నారు. అయితే తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టిన ఈమె తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని మాత్రం బయటపెట్టారు దీంతో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

పెళ్లి కాకుండానే తల్లి అయింది అంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక తనకు 2023 ఏప్రిల్ నెలలో కుమారుడు జన్మించారు. అయితే తనకు కుమారుడు పుట్టిన తర్వాత తన భర్త గురించి ఈమె పలు విషయాలను వెల్లడించారు. ఇక 2024వ సంవత్సరం పూర్తి అవుతున్న తరుణంలో ఈమె గత ఏడాదికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను షేర్ చేశారు. అందులో భాగంగా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా బయటపెట్టారు.

ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నటువంటి కిట్ చూయించారు అయితే ఈమె అక్టోబర్ నెలలోనే కన్సీవ్ అయ్యారని స్పష్టమవుతుంది. ఇలా తన భర్త కొడుకుతో ఉన్నటువంటి ఫోటోలు ఈమె ప్రెగ్నెన్సీ కిట్ చూయిస్తూ అక్టోబర్ అని రాశారు. దీంతో ఈమె మరోసారి తల్లి కాబోతుందని తెలిసిన అభిమానులు ఇలియానా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.