ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్య వల్ల ఎన్నో జంటలు ఇబ్బందులు పడుతున్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఎక్కువమందిలో సంతాన సమస్యలకు కారణమవుతూ ఉండటం గమనార్హం. పీసీఓడీ, గర్భకోశ వ్యాధులు, ఫైబ్రాయిడ్స్, అధిక బరువు, థైరాయిడ్ గ్రంథి లోపాలు, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఇతర సమస్యల వల్ల కొంతమంది సంతానలేమితో బాధ పడే అవకాశం అయితే ఉంటుంది.
ట్యూబల్ బ్లాకేజ్, సుఖవ్యాధులు, మానసిక ఒత్తిడి వల్ల కూడా కూడా సంతాన లేమి సమస్య వేధించే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్లు ఆ సమస్యల వల్ల సంతానలేమి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్లు సరైన విధంగా ఉత్పత్తి కాకపోవడం వల్ల కూడా సంతానలేమి సమస్య వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సంతానలేమి సమస్యలను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అధిక బరువు కూడా సంతానలేమికి రీజన్ కాగా సరైన బరువు ఉంటే త్వరగా పిల్లల్ని కనే అవకాశాలు అయితే ఉంటాయి. ఆల్కహాల్ కు దూరంగా ఉండటం వల్ల సంతానలేమి సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. పోషకాహార లోపం వల్ల కూడా సంతానలేమి సమస్యలు వస్తాయి.
సరైన లైఫ్ స్టైల్ పాటిస్తూ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా సంతానలేమి సమస్యలను దూరం చేసుకోవచ్చు. మామిడి, దానిమ్మ, పైనాపిల్ లను తినడం ద్వారా కూడా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే మాత్రం వైద్యులను సంప్రదించి వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే మంచిది.