ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారా.. ఎలా పూజ చేయాలో తెలుసా?

సాధారణంగా మనం మన ఇంట్లో ఇష్టదైవాల ప్రతిమలను లేదా ఫోటోలను పెట్టి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే చాలామంది ఇంట్లో వినాయకుడి విగ్రహాలను పెట్టుకొని పూజ చేస్తుంటారు.ఈ విధంగా వినాయకుడి ప్రతిమను ఇంట్లో పెట్టి పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని అలాగే మనం చేసే ఎలాంటి కార్యాలు అయినా కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయని భావిస్తారు. అందుకే చాలామంది ఇళ్లల్లో లేదా ఆఫీసులలో వినాయకుడి విగ్రహాలను పెట్టి పూజిస్తుంటారు.

ఇకపోతే మనం ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని పెట్టి పూజించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.ముఖ్యంగా వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టించే సమయంలో పలు జాగ్రత్తలు సరైన దిశలోనే ప్రతిష్టించి పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆ ఇంట్లో సుఖసంతోషాలకు ఏమాత్రం లోటు ఉండదని చెబుతారు. అలా కాకుండా వినాయకుడి విగ్రహాలను ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం లోపలి పైభాగంలోనూ, పెట్టుకోకూడదు.

ఇకపోతే బాత్రూం పరిసర ప్రాంతాలలో కూడా వినాయకుడి ప్రతిమలను పెట్టకూడదు. ఇంట్లో వినాయకుడి ప్రతిమలను కనుక పెట్టుకుంటే వినాయకుడు నృత్యం చేస్తున్నటువంటి విగ్రహాలను ఏమాత్రం ఉంచకూడదు. అలాగే ఇలాంటి విగ్రహాలను బహుమతిగా కూడా ఇతరులకు ఇవ్వకూడదు.ఇంట్లోకి వినాయకుడి ప్రతిమలను కనుక తెచ్చుకుంటే ఎల్లప్పుడూ తొండం కుడివైపుకు తిరిగి ఉండే వినాయకుడిని తెచ్చి పెట్టుకోవడం ఎంతో మంచిది.ఇక వినాయకుడికి పూజ చేసే సమయంలో కేవలం కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన అరటిపండ్లు ఉండ్రాళ్ళు గరికను సమర్పించి పూజ చేయడం చాలా మంచిది.