మనలో చాలామంది పడుకున్న వెంటనే నిద్ర రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సరైన నిద్ర లేకపోతే మరుసటి రోజు చేయాల్సిన పనులను సైతం వేగంగా చేయడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే. కొంతమంది మంచి నిద్ర కోసం నిద్ర మాత్రలను వినియోగిస్తున్నారు. అయితే నిద్ర మాత్రల వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. నిద్రమాత్రలు ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
శరీరంలోని నాడీ వ్యవస్థలపై నిద్రమాత్రలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. నిద్రమాత్రలు ఎక్కువగా వాడేవాళ్లను మూడ్ స్వింగ్స్, ఇతర సమస్యలు వేధిస్తాయి. నిద్రమాత్రలు తరచూ వాడేవాళ్లను గుండె సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు నిద్రమాత్రల వల్ల వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
స్లీపింగ్ పిల్స్ నిద్ర సంబంధిత సమస్యలకు కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది. స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం ద్వారా శరీరం బలహీనమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎక్కువ డోస్ నిద్రమాత్రలు వేసుకుంటే కొన్నిసార్లు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మహిళలు వైద్యుల సలహాల ప్రకారం నిద్ర మాత్రలు వాడాలి. డ్రింక్స్ లో నిద్రమాత్రలు కలిపి తీసుకోకూడదు.
నిద్రలేమి సమస్యలతో బాధ పడేవాళ్లు కొన్ని న్యాచురల్ టిప్స్ ను ఫాలో కావడం ద్వారా ఈ సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. తలను కొబ్బరినూనెతో మర్ధనా చేయడం, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం, బెడ్ రూమ్ లో లైటింగ్ లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి.