Microsoft: ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకోండి.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ డెడ్ లైన్!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి తక్కువ పనితీరు చూపుతున్న ఉద్యోగులకు గట్టిగా హెచ్చరిక వచ్చేసింది. తమ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు కేవలం ఐదు రోజులు గడువు ఇస్తూ, కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ అమీ కోల్మన్ ఏప్రిల్ 22న మేనేజర్లకు ఈ-మెయిల్ పంపారు. దీంతో సంస్థలోని ఉద్యోగులలో టెన్షన్ మొదలైంది.

‘గ్లోబల్ వాలంటరీ సెపరేషన్ అగ్రిమెంట్ (GVSA)’ పేరుతో మైక్రోసాఫ్ట్ రెండు ఆప్షన్లు తీసుకొచ్చింది. ఒకటి కఠినమైన లక్ష్యాలతో కూడిన ‘పనితీరు మెరుగుదల ప్రణాళిక (PIP)’. రెండోది 16 వారాల వేతనంతో కూడిన స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీ. అయితే ఏది ఎంచుకున్నా, నిర్ణయం తీసుకోవడానికి ఐదు రోజులు మాత్రమే గడువు.

ఈ ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ప్యాకేజీ తీసుకునే వారు మైక్రోసాఫ్ట్‌కి తిరిగి రాబోయే రెండు సంవత్సరాలపాటు దరఖాస్తు చేసుకోలేరు. ఇక, PIP ఎంచుకున్న ఉద్యోగులకు ప్యాకేజీ వర్తించదు. అంతేగాకుండా, ఈ రెండు కేటగిరీల్లో ఉన్నవారు అంతర్గత బదిలీలకు కూడా అనర్హులు.

ఈ విధానం ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఐదు రోజుల్లో భవిష్యత్తు నిర్ణయించుకోవడం, మైక్రోసాఫ్ట్‌లో తిరిగి అవకాశం లేకపోవడం వంటి అంశాలు ఆందోళనకు దారితీస్తున్నాయి. దీనివల్ల తక్కువ పనితీరు చూపిన వారిని సులభంగా తక్షణమే వదిలించుకోవడమే అసలు ఉద్దేశమని విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా, మైక్రోసాఫ్ట్ మాత్రం ఈ విధానాన్ని పనితీరు మెరుగుదల కోసం తీసుకొచ్చిన మార్గంగా ప్రాజెక్ట్ చేస్తోంది.

రాములమ్మ నిజస్వరూపం || Director Geetha Krishna EXPOSED Vijayashanthi Real Charecter || TeluguRajyam