Pawan Kalyan: దయచేసి కూలి అనే పదం వాడొద్దు… పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలోని సికె కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పంచాయతీరాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు. పల్లెల్లో ఉండడం అంటే తనకు ఇష్టమని తెలిపారు. పల్లె నిధులు వాటికే ఉపయోగించాలని చెప్పారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల కృషితో పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.బిల్లులు రాక పోయిన పనులు చేసిన గుత్తేదారులకు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకంలో 75 లక్షల మందికి పైగా శ్రామికులు నిధులు ఇచ్చామని పవన్ తెలిపారు. ఇక ఉపాధి హామీ పథకంలో కూలి అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని వాడాలని ఆయన సూచించారు. ఇకపై ఎవరూ కూడా కూలి అనే పదాన్ని వాడకూడదని తెలిపారు..

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన గత ప్రభుత్వం గురించి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.గత ప్రభుత్వం వల్ల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గతంలో చాలా తండాలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. అభివృద్ధి చేయాలని నిర్ణయించా.. ఈ క్రమంలో చిన్న పైరవీలు చేసినా చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.