Nani: నాచురల్ స్టార్ నాని ఇటీవల వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకోగా మరోవైపు సినిమాలను నిర్మిస్తూ కూడా నాని ఎంతో సక్సెస్ అందుకుంటున్నారు. ఇక ఈయన నటించిన హిట్ 3 సినిమా మే ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నానికి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఇకపై మీకు బిగ్ బాస్ హోస్ట్ గా అవకాశం వస్తే చేస్తారా అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు నాని ఊహించని సమాధానం చెప్పారు.
నాని ఇదివరకు బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించిన విషయం తెలిసిందే మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించగా రెండవ సీజన్ నాని హోస్టుగా వ్యవహరించగా మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ బిగ్ బాస్ అవకాశం వస్తే చేస్తారా అన్న ప్రశ్నకు నాని స్పందిస్తూ…
బిగ్ బాస్ చాప్టర్ ముగిసింది.. ఇక దాని జోలికి వెళ్ళను. నా జీవితంలో బిగ్ బాస్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. బయట ప్రపంచాన్ని నాకు బిగ్ బాస్ డిఫెరెంట్ గా చూపించింది. నేను నార్మల్ గేమ్ అనుకుని బిగ్ బాస్ 2 హోస్ట్ గా వెళ్ళా. కానీ దానిలో చాలా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయనీ, అందుకే ఇకపై బిగ్ బాస్ జోలికి వెళ్ళను అంటూ ఈ సందర్భంగా నాని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నాని హోస్ట్ గా వ్యవహరించిన సమయంలో నటుడు కౌశల్ విన్నర్ అయిన విషయం తెలిసిందే.