చుండ్రు సమస్య వల్ల జుట్టు రాలుతోందా.. సులువుగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

dandruff

మనలో చాలామందిని వయస్సుతో సంబంధం లేకుండా ఏదో ఒక సమయంలో చుండ్రు సమస్య వేధిస్తుందనే సంగతి తెలిసిందే. పురుషులతో పోల్చి చూస్తే మహిళలు ఈ సమస్య వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది చుండ్రు సమస్యకు చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు సులువుగా చెక్ పెడుతుంటారు. మరి కొందరు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సమస్యను దూరం చేసుకోవడం సాధ్యం కాదు.

అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చుండ్రు సమస్య దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అధిక ఒత్తిడి, హార్మోన్ అసమతుల్యత, విటమిన్స్ లోపం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో చుండ్రు సమస్య వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. నువ్వుల నూనెను వాడటం ద్వారా చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చు. ఈ నూనె వల్ల జుట్టు కూడా పెరుగుతుంది. వారానికి కనీసం మూడు నుంచి నాలుగుసార్లు నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది.

కొబ్బరి నూనెలో కొంతమేర కర్పూరం పొడిని కలిపి జుట్టుకు రాయడం ద్వారా కూడా జుట్టు సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొబ్బరినూనెలో ఉండే పోషకాలు చుండ్రు సమస్యను దూరం చేయడంలో ఎంతగానో తోడ్పడతాయి. చుండ్రుకు చెక్ పెట్టే విషయంలో వేపనూనె కూడా అద్భుతంగా పని చేస్తుంది. వేపనూనెలో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేస్తే మంచి బెనిఫిట్స్ పొందవచ్చు.

అధిక తేమ స్థాయిల వల్ల కొన్ని సందర్భాల్లో చుండ్రు సమస్య వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. డైలీ షాంపూతో తల శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రాత్రిపూట కంటే పగటిపూట నూనెను ఉపయోగించడం వల్ల ఈ సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది.