Kiran Chebrolu: వైయస్ భారతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు…బెయిల్ పై బయటకు వచ్చిన కిరణ్!

Kiran Chebrolu: కిరణ్ చోబ్రోలు టిడిపి కార్యకర్తగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వైసీపీ పై అలాగే వైసిపి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. అయితే ఇటీవల ఈయన వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన సతీమణి వైయస్ భారతి రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.

ఇలా భారతి రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడమే కాకుండా ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వైసిపి నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే మహిళల గురించి ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం పార్టీ కూడా ఈయనని సస్పెండ్ చేయడమే కాకుండా తనపై చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలోనే కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే కోర్టు ఈయనకు 14 రోజుల పటు రిమాండ్ విధించింది. తాజాగా ఈయన రిమాండ్ గడుపు పూర్తి కావడంతో కిరణ్ కు బెయిల్ మంజూరు చేశారు. ఇలా భారతి రెడ్డి గురించి అసభ్యకర పదజాలంతో మాట్లాడిన కిరణ్ కు బేయిలు రావడంతో వైసిపి నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు.

ఇక భారతి రెడ్డి గురించి కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే వెంటనే కిరణ్ మరొక వీడియోని కూడా విడుదల చేశారు క్షణికావేశంలో తాను భారతి రెడ్డి గురించి తప్పుగా మాట్లాడానని తాను మాట్లాడిన మాటలు పూర్తిగా తప్పేనని తాను భారతి రెడ్డి కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరుతానని దయచేసి నా తప్పును క్షమించండి అంటూ ఈయన మరొక వీడియోని విడుదల చేసినప్పటికీ ఈయనపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది.