Imanvi: నేను పాకిస్తాన్ అమ్మాయిని కాదు… క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్!

Imanvi: పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యటకులపై సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు దాడి జరిపిన ఘటన ఒక్కసారిగా అందరిని ఉలిక్కిపాటుకు గురి చేసింది ఈ దాడిలో సుమారు 28 మంది వరకు మరణించారు. కొత్తగా పెళ్లయిన దంపతులు భార్య బిడ్డలతో ఎంతోమంది పర్యటకులు ఈ ప్రాంతాన్ని వీక్షించడం కోసం అక్కడికి వెళ్లారు. అయితే ఉగ్ర దాడి లో భాగంగా కాశ్మీర్ రక్త మోడింది.

ఇలా కాశ్మీర్లో పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు దాడి చేయడంతో కేంద్ర ప్రభుత్వం సైతం పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.ఇదిలావుంటే ఈ ఘటన అనంతరం పాకిస్థాన్‌కి చెందిన నటులపై మళ్లీ వ్యతిరేకత మొదలైంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఒక ప్రాజెక్ట్‌లో ఇమాన్ ఎస్మాయిల్ అనే హీరోయిన్ నటిస్తుండగా.. ఇమాన్ పాకిస్థాన్‌కి చెందిన నటి ఈమెను వెంటనే ఈ సినిమా నుంచి తొలగించాలి అంటూ సోషల్ మీడియా వేదికగా నేటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఈ విధంగా ఇమాన్వి గురించి సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై ఇమాన్వి స్పందించారు.తాను పాకిస్థాన్‌కి చెందిన అమ్మాయిని కాదని.. తాను ఇండో అమెరికన్ అని రాసుకోచ్చింది.పహల్గాంలో జరిగిన విషాద సంఘటనకు సంబంధించి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. అమాయక ప్రాణాల నష్టం ఎంతో బాధాకరం. ఈ ఘటన నా హృదయాన్ని కలచివేసింది. హింసాత్మక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ ద్వారా వెలుగు, ప్రేమను పంచడమే నా లక్ష్యంగా ఉన్నందున, మనమందరం ఒకేతాటిపైకి వచ్చే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను.

ఇక తాను పాకిస్తాన్ అమ్మాయిని కాదని పాకిస్థాన్‌కి చెందిన నటిని అంటూ వస్తున్న వార్తలు వైరలవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను కానీ నా కుటుంబం కానీ పాకిస్తాన్ సైన్యంతో సంబంధం కలిగి లేరు. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్‌ని. నా తల్లిదండ్రులు యుక్త వయసులో చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చిన తర్వాత నేను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించాను. వారు అనంతరం అమెరికన్ పౌరులుగా మారారు అంటూ ఈమె తన పౌరసత్వం గురించి క్లారిటీ ఇస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.