కాళ్లు పగుళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… కొబ్బరి నూనెతో సమస్యకు చెక్ పెట్టండిలా!

చలికాలం వచ్చిందంటే చాలు తొందరగా మన శరీరం పొడిబారి పగుళ్లకు కారణమవుతుంది.ముఖ్యంగా చలికాలంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాదాల పగుళ్లు సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇలా పాదాలు పగుళ్ల సమస్యతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడటానికి వెంటనే పగిలిన చోట ఆయింట్మెంట్ రాయడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇది కూడా పెద్దగా ప్రయోజనకరంగా ఉండదు. పాదాల పగుళ్లను అరికట్టడానికి కొబ్బరి నూనె ఎంతో ప్రయోజనకరమని చెప్పాలి.

పాదాలు పగుళ్ల సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మన పాదాలను శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత కాస్త కొబ్బరి నూనె వేసి పాదాల పగుళ్లపై రాసి బాగా మర్దన చేయాలి.ఇలా మర్దన చేసిన తర్వాత కాళ్లకు సాక్సులు వేసుకొని నిద్రపోయి మరుసటి రోజు ఉదయం లేవగానే కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల కాళ్లు పగుల సమస్య నుంచి బయటపడవచ్చు.

కొబ్బరి నూనెలో మనకు విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. ఇది పాదాలలో దెబ్బతిన్న చర్మ కణాలను తిరిగి బాగు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అలాగే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది.ఇక ఇందులో ఉన్నటువంటి లారిక్ యాసిడ్ దెబ్బతిన్న చర్మ కణాలను తిరిగి పునరుత్పత్తించడంలో దోహదపడుతుంది.ఇక కొబ్బరి నూనెతో బాగా మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ కూడా మంచిగా జరిగి తొందరగా ఈ పాదాల పగుళ్లు నయం అవడానికి దోహదం చేస్తుంది.