Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోగా కూడా గుర్తింపు పొందారు. ఇలా నటుడిగా తనని తాను ప్రూఫ్ చేసుకుంటూ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సినిమా అంటే ఎంతో పిచ్చి ఉన్నటువంటి ఎన్టీఆర్ సినిమా కోసం ఏం చేయడానికి అయినా వెనకాడరనే సంగతి మనకు తెలిసిందే.
సినిమా కోసం ఎలాంటి సాహసాలైనా చేస్తూ ఉంటారు బరువు తగ్గడం బరువు పెరగడం వంటివి కూడా ఎన్టీఆర్ చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా కోసం పూర్తిస్థాయిలో బరువు తగ్గిపోయారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఉన్నఫలంగా ఎన్టీఆర్ ఇలా బరువు తగ్గడానికి గల కారణాలు ఏంటని అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఎన్టీఆర్ బరువు తగ్గడం కోసం ఎలాంటి డైట్లు వర్కౌట్స్ చేయలేదు కేవలం ఒకే ఒక చిన్న పనితోనే ఐదు నెలలలో ఏకంగా 18 కిలోలు తగ్గారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఎప్పుడు తీసుకునే డైట్ ఫాలో అవుతూ కేవలం నూనె, ఉప్పు, షుగర్ ఈ మూడు లేకుండా ఆహార పదార్థాలను తీసుకునే వారట ఇలా ఈ మూడింటిని దాదాపు 5 నెలల పాటు పక్కన పెట్టడం వల్ల ఎన్టీఆర్ ఏకంగా 18 కిలోలు తగ్గారని తెలుస్తుంది ఇలా సినిమా కోసం ఉప్పు నూనె షుగర్ విడిచిపెట్టడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక్కడే ఎన్టీఆర్ కి సినిమాల పట్ల ఉన్న డెడికేషన్ ఏంటో స్పష్టం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.