సాధారణంగానే చుండు సమస్యతో బాధపడే వారి సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువగానే ఉంటోంది. దానికి తోడు వేసవి సీజన్ ప్రారంభం అవడంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలలో చెమట ఎక్కువగా పట్టడం జరుగుతుంది దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువై చుండు సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. కావున చుండ్రు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాలంటే కొన్ని ఆయుర్వేద పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలను తెలుసుకునే ముందు మీరు ప్రతిరోజు ఒక నియమాన్ని పాటించాల్సి ఉంటుంది.వేడి నీటితో స్నానం చేస్తుంటే వెంటనే మానుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోండి. వేడి నీటితో స్నానం చేస్తే చుండ్రు సమస్య మరింత అధికమవుతుంది.
వేప నూనె, కొబ్బరి నూనె,ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని సమపాలల్లో తీసుకొని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు మర్దన చేసుకొని 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీకు వీలైతే వేప ఆకులను మెత్తని గుజ్జులా మార్చుకొని తలకు మర్దన చేసుకుంటే వేపాకులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు సమస్యను తొలగించడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.యాంటీ బ్యాక్టీరియల్ , ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న మెంతులను రాత్రంతా నానబెట్టి మరసటి రోజు మెత్తటి మిశ్రమంగా మార్చి ఈ మిశ్రమాన్ని తల కుదుళ్లకు అంటే విధంగా మర్దన చేసుకుంటే చుండ్రు సమస్య తొలగి వెంట్రుకలు దృఢంగా కాంతివంతంగా తయారవుతాయి.
తల స్నానం చేయాలనుకున్నప్పుడు గంట ముందు కొబ్బరి నూనెతో వెంట్రుకల కుదుళ్లకు అంటే విధంగా మర్ధన చేసుకొని తల స్నానం చేస్తే చుండు సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.కలబంద గుజ్జును జుట్టు కుదుళ్లకు మర్దన చేసుకొని అరగంట తర్వాత స్నానం స్నానం చేస్తే చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు.తాజా నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి జుట్టు కుదుళ్లకు అంటే విధంగా మర్దన చేసుకుంటే చుండ్రు సమస్య తొలగిపోయి తలలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.