Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎవరు నాకు తెలియదు… ఘోరంగా అవమానించిన రేణు దేశాయ్!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు చిన్న పిల్లలని అడిగిన పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో చెప్పేస్తారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకున్నారు. ఈయన రాజకీయాల పరంగా కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాల పరంగా మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు కానీ ఈయన మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే ఈమె పవన్ కళ్యాణ్ తెలియదు అని చెప్పడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…

పవన్ తెలియదు అంటూ రేణు దేశాయ్ మాట్లాడింది ఇప్పుడు కాదండోయ్ బద్రి సినిమాకు ముందు అని తెలుస్తుంది. బద్రి సినిమా స్టోరీ మొత్తం పూర్తి అయిన తర్వాత తనకు తెలిసినవారు రేణు దేశాయ్ ఫోటోలను డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు పంపించడంతో ఎలాగైనా ఆమెను సినిమాలో తీసుకోవాలని పూరి జగన్నాథ్ ముంబై వెళ్ళి మోడలింగ్ చేస్తున్నటువంటి రేణు దేశాయిని కలిశారు.

ఆమెకు స్టోరీ లైన్ వినిపించి ఈ సినిమాలో నటించాలని తెలిపారు. ఈ సినిమాలో హీరో కూడా పెద్ద హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఎవరు ఆయన ఎవరో నాకు తెలియదు అంటూ చెప్పారట నాకు తెలుగులో తెలిసింది చిరంజీవి నాగార్జున వెంకటేష్ మాత్రమేనని రేణు దేశాయ్ చెప్పారట.

ఇలా మీకు తెలిసిన స్టార్ హీరో చిరంజీవి తమ్ముడే పవన్ కళ్యాణ్ అని పూరి జగన్నాథ్ చెప్పినప్పటికీ నేను అతనిని చూడందే సినిమాకు ఒప్పుకోనని తెలిపారు. దీంతో హైదరాబాద్ కి ఆమెను పిలిపించి రామానాయుడు స్టూడియోలో పవన్ కళ్యాణ్ ని పరిచయం చేశారట అయితే స్టార్ హీరో అయినప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా సింపుల్ పవన్ కళ్యాణ్ ఉండటం చూసిన రేణు దేశాయ్ ఆశ్చర్యపోతూ ఈ సినిమాకు ఒప్పుకోవడమే కాకుండా ఈ సినిమా సమయంలోనే అతనితో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. ఇలా అప్పటి విషయాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ కావడంతో మరోసారి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.