ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఉదయ సింహ, వేం నరేందర్ రెడ్డిలు విచారణకు హాజరయ్యారు. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇవ్వాలని చూసిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, నాలుగున్నర కోట్లు విదేశాల నుంచి వచ్చాయా అనే విషయాల పై రేవంత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనున్నట్టు సమాచారం. ఈడీ విచారణ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.