KTR: అదొక లొట్ట పీస్ కేసు… నన్ను అరెస్టు చేస్తే రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాల్సిందే: కేటీఆర్

KTR: మాజీ మంత్రి కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలుసులే అయితే ఈ విషయంపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విషయంలో కేటీఆర్ ఏ క్షణమైన అరెస్టు కావచ్చని వార్తలు కూడా వినపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో తనపై నమోదు అయినటువంటి కేసుల గురించి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి తనదైన శైలిలోనే సమాధానాలు చెప్పారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నాపై నమోదు అయినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఒక లోట్టపీసు కేసు అని తెలిపారు. ఇందులో భాగంగా రూపాయి కూడా అవినీతి జరగలేదు అలాంటప్పుడు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కూడా తప్పేనని ఈయన తెలిపారు. కేసు విషయంలో కోర్టులో జరుగుతన్న వాదన సందర్భంగా న్యాయమూర్తి అడిన ప్రశ్నలకు ఏజీ సమాధానం చెప్పలేకపోయారని అన్నారు.

ఇక ఈ కేసులో నన్ను కనుక అరెస్టు చేసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలని కేటీఆర్ తెలిపారు. కొత్తగా టెండర్లు పిలవబోతున్న ట్రిపుల్ ఆర్ విషయంలో చాలా అవినీతి జరగబోతోందని ఆరోపించారు కేటీఆర్. దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరగబోతోందని తెలిపారు. తెలంగాణలో పెద్దపెద్ద కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుని ఢిల్లీకి ముడుపులు చెల్లిస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వెనక్కి తగ్గేది లేదని సంక్రాంతి తర్వాత వారిపై పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నామని తెలిపారు. ఇక ఈ ఏడాదిలోనే ఉప ఎన్నికలు కూడా ఉంటాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక కెసిఆర్ ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమయ్యారంటే చాలామంది కామెంట్ లు చేస్తున్నారు. అయితే ఆయనకు ఎప్పుడు బయటకు రావాలి. ఎప్పుడు ప్రజలతో మమేకం కావాలనే విషయాలు స్పష్టంగా తెలుసని కేటీఆర్ తెలిపారు.