KTR: నన్ను జైల్లో పెట్టడం రేవంత్ రెడ్డికి కూడా సాధ్యం కాదు… కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: అవకాశం దొరికితే చాలు కేటీఆర్ రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మరోసారి ఫార్ములా ఈ కార్ రేసు విషయంపై కేటీఆర్ స్పందించారు తనపై ఏసీబీ కేసు నమోదు చేయించారు. అయితే నన్ను జైల్లో పెట్టడం రేవంత్ రెడ్డి వల్ల ఎప్పటికీ కాదని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ కారు రేసులో తాను ఒక రూపాయి కూడా అవినీతి చేయలేదు అలాంటప్పుడు ఏసిబి ఎఫ్ఐఆర్ కూడా తప్పేనని ఈయన కొట్టి పారేశారు.

ఈకేసు విషయంలో హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూసిన తర్వాత మాట్లాడతామన్నారు.రైతు భరోసా ఇచ్చే విషయంలో కూడా మెలిక పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని చిట్‌చాట్‌లో తెలిపారు. కేవలం రైతు భరోసా డబ్బులను ఎగరగొట్టే నేపథ్యంలోనే ఈయన తనపై కేసును నమోదు చేయించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు.

ఇక ఎన్నికలకు ముందు బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లను కల్పిస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఆయన మాట నిలబెట్టుకోలేకపోయారు. బీసీల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.ఇక ప్రతిపక్షనాయకుడికి గౌరవం ఇవ్వకుండా పీఏసీ చైర్మన్‌ను ఎన్నుకొని.. కేసీఆర్ బయటకు రాడేంటని విమర్శిస్తున్న వారికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.

ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బిఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు పలు కార్యక్రమాలు, పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని ఈయన సూచించారు. మరి కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసులో రూపాయి కూడా అవినీతి జరగలేదంటూ కేటీఆర్ మాట్లాడటం పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.