జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర పాదయాత్ర మొదలైనప్పటి నుండి పార్టీలో చేరికలు ఎక్కువయ్యాయి. పోలీసు శాఖలో పని చేసిన అధికారులు కూడా వైసిపి తీర్ధం పుచ్చుకుంటున్నారు.
జగన్ పాదయాత్ర చేస్తున్న విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఆదివారం గుంటూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ డిఐజి చంద్రగిరి ఏసురత్నం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైసిపి అధినేత జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పోలీసు ఉన్నతాధికారులు పార్టీలో చేరడం హర్షనీయం అంటున్నారు వైసిపి శ్రేణులు. జగన్ పై నమ్మకంతోనే ఎక్కువ సంఖ్యలో పార్టీలో జాయిన్ అవుతున్నారని చెబుతున్నారు.
ఏసురత్నంతో పాటు పాత్రుళ్ళ నగర్ కాలనీకి చెందిన మరో 1500 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.