Mowgli 2025: రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ నుంచి జాస్మిన్ గా సాక్షి సాగర్‌ మదోల్కర్‌ పరిచయం

తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకుని యంగెస్ట్ దర్శకుడిగా గుర్తింపు పొందిన సందీప్ రాజ్ మరో ఎమోషనల్ రిచ్ స్టోరీతో వస్తున్నారు. మోగ్లీ 2025 టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో యంగ్ ట్యాలెంటెడ్ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కాంటెంపరరీ లవ్ స్టోరీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటివలే ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా డెబ్యుటెంట్ సాక్షి సాగర్‌ మదోల్కర్‌ నటిస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మేకర్స్ జాస్మిన్ గా హీరోయిన్ సాక్షి సాగర్‌ మదోల్కర్‌ పాత్రని పరిచయం చేశారు.

ఇంటెన్స్ అండ్ పవర్ ఫుల్ లుక్ లో త్రిశూలం పట్టుకొని ఆదిశక్తిగా కనిపించిన సాక్షి మదోల్కర్‌ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ సినిమాలో ఆమె క్యారెక్టర్ పై చాలా క్యురియాసిటీని పెంచింది.

మోగ్లీ 2025కి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కలర్ ఫోటో కు సక్సెస్ ఫుల్ సౌండ్‌ట్రాక్స్ అందించిన కాల భైరవ సంగీతం సమకూర్చనున్నారు. బాహుబలి 1 & 2, RRR వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లలో చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రామ మారుతి ఎమ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కలర్ ఫోటో, మేజర్, అప్ కమింగ్ గూడాచారి 2 చిత్రాలకు పని చేసిన పవన్ కళ్యాణ్ ఎడిటర్.

మోగ్లీ 2025 చిత్రాన్ని 2025 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: రోషన్ కనకాల, సాక్షి సాగర్ మడోల్కర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: కాల భైరవ
డిఓపి: రామ మారుతి ఎం
ఎడిటర్: పవన్ కళ్యాణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్ : ఫస్ట్ షో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

బాబుని రాధాకృష్ణ  హెచ్చరిస్తున్నాడా? || Mv Mysura Reddy About ABN Radha Krishna & Chandrababu || TR