YS Jagan: ఆ పోలీసుల పేర్లు రాసి పెట్టుకోండి.. మీకు సెల్యూట్ కొట్టిస్తా… వైయస్ జగన్?

YS Jagan: వైకాపా అధినేత వైయస్ జగన్మహన్ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అభయం కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్యకర్తలనుఅరెస్టులు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసే వారిని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో వైయస్ జగన్ ఎప్పటికప్పుడు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ వచ్చారు.

తాజాగా వైస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా నేతలతో బుధవారం జగన్‌ సమావేశమయ్యారు. కార్యకర్తలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. అక్రమంగా ఏ పోలీస్ అయితే మీపై కేసు పెట్టి మిమ్మల్ని కొడుతూ ఇబ్బందులకు గురి చేస్తారో అలాంటి పోలీసుల పేర్లన్నీ కూడా మీరు మీ డైరీలో రాసి పెట్టుకోండి. తప్పనిసరిగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోలీసుల చేతనే మీకు సెల్యూట్ కొట్టిస్తాను అంటూ జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లోకేష్ పాదయాత్ర చేస్తూ రెడ్ బుక్ మైంటైన్ చేసిన సంగతి తెలిసిందే . ఎవరైతే తమ పార్టీ పట్ల నాయకుల పట్ల ఇబ్బందులకు పాల్పడి వారిని హింసించి ఉంటారో అలాంటి వారి పేర్లు అన్నింటిని కూడా తను రెడ్ బుక్ లో రాసుకున్నానని అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వీరుపై చర్యలు చేపడతానని గతంలో లోకేష్ తెలిపారు.

ఇక కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తమ పట్ల పక్షపాతంగా వ్యవహరించిన పోలీసులపై అలాగే ఐపీఎస్ లుడీఎస్సీ లపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే కొంతమంది నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు దీంతో వైకాపా ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ విమర్శలు చేశారు. ఇక వీరి అరాచకాలను తట్టుకోలేక కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను చూస్తున్న జగన్ సైతం మీరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పేర్లను రాసి పెట్టుకోమని అధికారంలోకి రాగానే వారి సంగతి తేలుస్తా అంటూ భరోసా కల్పిస్తున్నారు.