ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఎప్పటికీ సాధ్యం కాదని చాలామంది భావిస్తున్నారు. పవన్ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోవడం, పవన్ కళ్యాణ్ మినహా జనసేన పార్టీలో సమర్థవంతమైన నాయకులు లేకపోవడం, పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేయకపోవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. జనసేన ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా పోటీ చేస్తే 2024 ఎన్నికల్లో కూడా షాక్ తప్పదని తెలుస్తోంది.
అయితే తాజాగా జరిగిన ఒక ఘటన వల్ల జనసేన ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. తాజాగా విజయవాడలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించాలని జనసేన నేతలు అనుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా జనసేన జెండా దిమ్మను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడంతో పోలీసులు, ప్రభుత్వ అధికారులు జనసేన పార్టీ నేత పోతిన వెంకట మహేష్ ఏర్పాటు చేసిన జనసేన జెండా దిమ్మెను కూల్చివేశారు.
అయితే ప్రభుత్వం దిమ్మెను కూల్చేయడం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ జగన్ సర్కార్ జనసేన ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. జెండా దిమ్మెను కూల్చితే పార్టీ ఉనికే లేకుండా పోతుందని పవన్ చెబుతుండటంతో జనసేన పార్టీ పరిస్థితి ఇంత ఘోరమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వైసీపీపై విమర్శలు మానేసి జనసేనను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని నెటిజన్లు చెబుతున్నారు.
అనుమతులు తీసుకోకుండా దిమ్మెలను ఏర్పాటు చేసి వివాదాలను సృష్టించాలని అనుకోవడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి వైసీపీపై విమర్శలు చేయడం వల్ల ఫలితం ఉండదని నెటిజన్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మారతారో లేదో చూడాల్సి ఉంది. పవన్ ఈ విషయంలో మారని పక్షంలో ఆయన పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.