Avatar Fire and Ash: దర్శకుడు సుకుమార్ నుంచి జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కు భారీ ప్రశంసలు

Avatar Fire and Ash: జేమ్స్ కామెరూన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన అంచనాలను సృష్టిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో ఈ సినిమాపై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుండగా, అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్‌లైన్ ట్రెండ్స్, ప్రేక్షకుల స్పందన ఈ చిత్రాన్ని అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌గా నిలబెడుతున్నాయి.

ఇప్పటికే ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ జేమ్స్ కామెరూన్‌తో ప్రత్యేక చర్చ జరిపిన విషయం తెలిసిందే. తాజాగా ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ కూడా ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సినిమా చూసిన అనంతరం సుకుమార్ మాట్లాడుతూ… ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఒక అబ్సల్యూట్ బ్లాక్‌బస్టర్ అని పేర్కొన్నారు. గ్రాండ్ విజువల్స్ మాత్రమే కాకుండా, కథలో నిండి ఉన్న బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను లోతుగా తాకుతాయని అన్నారు. ఎపిక్ స్కేల్‌లో కథను చెప్పడంలో జేమ్స్ కామెరూన్ మరోసారి తన సిగ్నేచర్ స్టైల్‌ను చూపించారని ప్రశంసించారు.

Sukumar’s Journey Into The World Of Avatar: Fire And Ash | Watch it in cinemas December 19

ఈ చిత్రం కేవలం ఒక సినిమా కాదని, ఇది నిజమైన ఈవెంట్ ఫిల్మ్ అని, కుటుంబ సమేతంగా థియేటర్‌లో చూసినప్పుడే పూర్తి అనుభూతి లభిస్తుందని సుకుమార్ స్పష్టం చేశారు.

భారత ప్రేక్షకులు ‘అవతార్’ ఫ్రాంచైజ్‌పై చూపిస్తున్న అపూర్వమైన ప్రేమ, ఈ సిరీస్‌ను సినీ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఫ్రాంచైజ్‌లలో ఒకటిగా నిలబెడుతోంది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఒక తరం మొత్తం గుర్తుంచుకునే గొప్ప సినిమాటిక్ అనుభూతిగా నిలవనుంది.

20th సెంచరీ స్టూడియోస్ సమర్పిస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం డిసెంబర్ 19న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Makireddy Purushotham Reddy Reacts On Ys Jagan Meets Bhavanipuram Demolition Victims || TR