Anam Ramanarayana Reddy: ఆత్మకూరు ప్రజలు డిప్యూటీ సీఎంకు రుణపడి ఉంటారు: మంత్రి రామనారాయణరెడ్డి

Anam Ramanarayana Reddy: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అడిగిన వెంటనే పవన్ నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఆదివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆనం.. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూనే, గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

అభివృద్ధి పనులకు పవన్ బాసట ఆత్మకూరు నియోజకవర్గంలోని 10 పంచాయతీ భవనాల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిధులు విడుదల చేశారని మంత్రి తెలిపారు. అలాగే, ఆత్మకూరు ప్రాంతీయ ఆసుపత్రిని 250 పడకలకు విస్తరిస్తున్నామని, భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, త్వరలోనే కర్నూలులో దేవాదాయశాఖ జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

గత ప్రభుత్వంపై ధ్వజం ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై ఆనం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాలతో అప్పుల్లో ముంచెత్తిందని మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే పట్టించుకోలేని దుస్థితిని గతంలో చూశామన్నారు.

“గత ప్రభుత్వం ఉద్యోగులకు రూ.32 వేల కోట్ల బకాయిలు పెడితే, మా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే రూ.12 వేల కోట్లు చెల్లించింది,” అని ఆనం గుర్తుచేశారు.

సోమశిల అభివృద్ధికి రూ.120 కోట్లు రూ.120 కోట్లతో సోమశిల అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆనం పేర్కొన్నారు. జగన్ మాయలో పడి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

అమరావతి రైతులకు వార్నింగ్ || Journalist Bharadwaj Reveals Shocking Facts About Amaravati Lands || TR