Purushaha: ‘పురుష:’ నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Purushaha : ఓ సినిమాను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లడం, చిత్రం విడుదలకు ముందే హైప్ పెంచడం అంటే మామూలు విషయం కాదు. కానీ ‘పురుష:’ టీం మాత్రం కేవలం కాన్సెప్ట్ పోస్టర్లు, ట్యాగ్ లైన్స్, ఇంట్రడక్షన్ పోస్టర్లతోనే అందరినీ ఆకట్టుకుంటున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ఆడియెన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు మూడు ప్రధాన పాత్రలకు సంబంధించిన పోస్టర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హీరోయిన్ వైష్ణవి కొక్కుర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. భార్యాభర్తల మధ్య గొడవ, ఒకే ఒరలో రెండు కత్తులు ఉండలేవు అనేట్టు సింబాలిక్‌గా చూపించినట్టు అనిపిస్తోంది. ఇక పోస్టర్లో ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అనే డైలాగ్ చూస్తుంటే ఈ పాత్ర ఎలా ఉంటుందో అందరికీ అర్థమై ఉంటుంది. మొత్తానికి ఒకరినొకరు అలా సీరియస్‌గా చూసుకుంటూ ఉండటాన్ని గమనిస్తే ఈ చిత్రంలో భార్యాభర్తల పోరు ఏ రేంజ్‌లో చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు.

పవన్ కళ్యాణ్‌తో పాటుగా ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి పాత్రలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని పోస్టర్లను చూస్తే అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర పోషిస్తున్న పాత్రకు సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇంకా ఇతర పాత్రలకు సంబంధించిన పోస్టర్లు ఇంకెంతగా ఆకట్టుకుంటాయో చూడాలి. ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ మూవీలో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని టీం చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.

నటీనటులు : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : కళ్యాణ్ ప్రొడక్షన్స్
నిర్మాత : బత్తుల కోటేశ్వరరావు
దర్శకుడు : వీరు వులవల
సంగీత దర్శకుడు : శ్రవణ్ భరద్వాజ్
కెమెరామెన్ : సతీష్ ముత్యాల
ఎడిటర్ : కోటి
ఆర్ట్ : రవిబాబు దొండపాటి
లిరిక్స్ : అనంత శ్రీరామ్
పీఆర్వో : సాయి సతీష్

పవన్ కారు గిఫ్ట్ || Journalist Bharadwaj Gives Full Clarity On Pawan Kalyan Car Gift to Sujith || TR