Jinn Movie: సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో నిర్మాత నిఖిల్ ఎం గౌడ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే
* మాది బెంగళూరు. నాకు చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తుండేవాడిని. ఇక మూవీస్ మీదున్న ఇంట్రెస్ట్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. నటించాలనే కోరికతో వచ్చి నిర్మాతగా మారాను.
* నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ద్వారా చిన్మయ్ రామ్ పరిచయం అయ్యారు. నాకు సినిమాల మీదున్న ప్యాషన్, ఇష్టం తెలుసుకుని చిన్మయ్ రామ్ ఈ ‘జిన్’ కథ గురించి చెప్పారు. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా అని నిర్మించేందుకు ముందుకు వచ్చాను.
* ‘జిన్’ చిత్రాన్ని కర్ణాటక, ఆంధ్రా బార్డర్‌లో షూట్ చేశాం. డిఫరెంట్ కంటెంట్, న్యూ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ‘జిన్’ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆల్రెడీ నేను సినిమాను చూశాను. కథ విన్నప్పుడు నేను ఏమైతే ఫీల్ అయ్యానో, ఊహించుకున్నానో తెరపైనా అదే ఫీలింగ్ కలిగింది. అందరినీ భయపెట్టేలా ఈ చిత్రం ఉంటుంది.

* ‘జిన్’ మూవీకి అలెక్స్ ఇచ్చిన ఆర్ఆర్, సునీల్ హొన్నలి విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా మా మూవీని రూపొందించారు. చిన్మయ్ రామ్ ఈ మూవీని గొప్పగా తెరపైకి తీసుకు వచ్చారు. మా టీం సహకారం వల్లే ‘జిన్’ మూవీ అద్భుతంగా వచ్చింది.
* ‘జిన్’ చిత్రంలో అమిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాడ్, రవి భట్, సంగీత ఇలా అందరూ అద్భుతంగా నటించారు. చిత్రీకరణ సమయంలోనూ అందరూ ఎంతో సహకరించారు.
* ‘జిన్’ చిత్రం ఆడియెన్స్ అందరికీ కొత్త అనుభూతిని ఇస్తుంది. మేం చేసిన ఈ కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మామూలుగా ఈ జిన్ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. మేం ఈ మూవీలో కొత్త ప్రపంచాన్ని చూపించబోతోన్నాం.
* ప్రస్తుతం మరి కొన్ని కథల్ని వింటున్నాను. అవన్నీ చర్చల దశల్లోనే ఉన్నాయి. నేను ఇకపై కన్నడ, తెలుగు భాషల్లో కంటిన్యూగా సినిమాల్ని నిర్మిస్తుంటాను.

