Chandrababu On PPP Policy : ఏపీ ’పీపీపీ’ చంద్రబాబు… వాట్ ఎన్ ఇంటెలిజెంట్ గయ్!

Chandrababu On PPP Policy : సచివాలయంలో ప్రారంభమైన ఐదో కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు! ఈ సందర్భంగా ప్రధానంగా పీపీపీ విధానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. మెడపై తల ఉండి, ఆ తలలో మస్తిష్కం ఉన్న ఎవరికైనా పరిపూర్ణమైన క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. అయితే.. ప్రజలకు అంత తెలివి లేదులే అనుకున్నారో.. లేక, తెలియకుండానే ఓపెన్ అయిపోయారో తెలియదు కానీ.. ‘పీపీపీ విధానంలో నిర్మించే వైద్య క‌ళాశాల‌ల్లో గ‌వ‌ర్నమెంట్ కంటే మెరుగైన వైద్యం అందుతుంది అని అన్నారు. ఈ ఒక్క విషయం బాబు విజన్ ను, ఏపీ భవిష్యత్తును కాలర్ పట్టుకుని నిలదీస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి..

చంద్రబాబు తన విజన్ లో భాగంగా చెబుతున్న పీపీపీ విధానం విషయంలో ప్రజలకు నిజాలు చెప్పడం లేదా?

భూమి, బిల్డింగ్, ఉద్యోగులు, వారి జీతాలు ప్రభుత్వానివి అయినప్పుడు పెత్తనం మాత్రం ప్రైవేటు వ్యక్తులు ఎందుకు చేయాలి?

ఈ ప్రశ్నకు చంద్రబాబు చెప్పే సమాధానంలో ఇసుమంతైనా లాజిక్ ఉందా?

ప్రభుత్వానికి అంత సమర్ధత లేకపోతే… గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లా అత్యంత సమర్థులైన వ్యక్తులను సీఈఓలు గా నియమించుకుని, సీఎం, మంత్రులు రెస్ట్ తీసుకోవచ్చు కదా?

పీపీపీ విధానంలో నిర్మించే వైద్య క‌ళాశాల‌ల్లో గ‌వ‌ర్నమెంట్ కంటే మెరుగైన వైద్యం అందుతుంది అంటే అర్ధం ఏమిటో బాబు చెప్పగలరా?

చంద్రబాబు ఏమి ఆలోచిస్తున్నారో.. ఎలా ఆలోచిస్తున్నారో.. ఎవరికి లబ్ధి చేకూర్చాలని ఆలోచిస్తున్నారో.. ఏమి ప్రయోజనం ఆశించి చేస్తున్నారో తెలియదు కానీ.. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ప్రైవేటుపరం చేయాలని మాత్రం భావిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది.. కానీ, పెత్తన మాత్రం ప్రైవేటు వ్యక్తులు చేస్తారు.. వాళ్లు ప్రభుత్వ బోర్డు పక్కన, చిన్న బోర్డు పెట్టుకుంటారు అంతే అని చంద్రబాబు చెబుతున్నారు. ఇందులో లాజిక్ ఏముందో.. మానసిక వ్యాధి లేని ఎవరికైనా అర్ధం అయిపోతుంది!

మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడాన్ని ప్రశ్నించడాన్ని.. అభివృద్ధిని అడ్డుకోవడంగా అభివర్ణిస్తున్న చంద్రబాబు.. అది ప్రైవేటుపరం కాదని తనదైన జ్ఞానంతో ప్రజలకు చెప్పీ చెప్పక గెంటుకొస్తున్న చంద్రబాబు.. అది ప్రైవేటుపరం చేయడమే అని ఒప్పేసుకున్నారు! ఇందులో భాగంగా… క‌లెక్టర్ల స‌మావేశంలో మాట్లాడుతూ… మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటు పర చేశారంటూ గ‌డిచిన నాయ‌కులు మాట్లాడుతున్నారని మండి పడ్డారు.

అనంతరం అసలు విషయం చెప్పారు. ఇందులో భాగంగా… వాస్తవానికి ప్రభుత్వ కళాశాలలకు పేరు ప‌లానా ప్రభుత్వ క‌ళాశాల అనే ఉంటుంది.. కాకపోతే దాని ప‌క్కన చిన్న అక్షరాల‌తో ప్రైవేట్ అని కూడా ఉంటుంది.. దాన్ని వాళ్లు మేనేజ్ చేస్తారు.. ఆస్తి మ‌న‌దే.. గైడ్‌ లైన్స్ మనమే ఫ్రేమ్ చేస్తాం.. ఇప్పుడుండే సీట్ల కంటే మ‌రిన్ని పెరుగుతున్నాయి.. వంద శాతం ఔట్ ఫేషెంట్లకు ఉచిత వైద్యం అందుతుంది.. గ‌వ‌ర్నమెంట్ ఆస్పత్రుల కంటే మంచి వైద్యం అందుతుంది అని చంద్రబాబు అన్నారు.

ఇక్కడే అసలు విషయం చెప్పకనే చెప్పారు. అదేమిటంటే… “పీపీపీ విధానంలో నిర్మించే వైద్య క‌ళాశాల‌ల్లో గ‌వ‌ర్నమెంట్ కంటే మెరుగైన వైద్యం రోగుల‌కు అందుతుంద‌ని”! అంటే… అవి ప్రభుత్వ వైద్య కళాశాలలు కాదనే కదా అర్ధం. అలా కాకపోతే.. గవర్నమెంట్ ఆస్పత్రుల కంటే మెరుగైన వైద్యం అనే మాట ఎందుకు వస్తుంది? ఇలాంటి విషయాలను కూడా కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు సమర్ధించడాన్ని నిస్సిగ్గు చర్య అని కొంతమంది అంటుంటే.. నగ్మంగా తిరగడంతో సమానం అని మరికొంతమంది మండిపడుతున్నారు.

ఏది ఏమైనా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో బ్రతకడానికి అలావాటు పడిపోవాలన్నమాట. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు పలువురు నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు!

చంద్రబాబుపై జగన్ సెటైర్లు || Ys Jagan Funny Satires On Chandrababu || Pawan Kalyan || YCP Vs TCP |TR