Buddha Venkanna: వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్‌లపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారిద్దరి ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్లను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల రాజకీయాల్లో యాక్టివ్ కావడంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బుద్దా వెంకన్న ఈ వ్యాఖ్యలు చేశారు.
అసలేం జరిగిందంటే.. గత ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నాని మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, ఇటీవల ఆయన స్పందిస్తూ.. తాను ఆరు నెలల తర్వాత తిరిగి ప్రజా ఉద్యమాల్లోకి వస్తానని, కార్యకర్తలకు అండగా ఉంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.

ఆరోగ్యంపై ఘాటు వ్యాఖ్యలు “ఆరు నెలల తర్వాత వస్తానంటున్న కొడాలి నాని, వంశీల ఆరోగ్య పరిస్థితి ఏంటి?” అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. “ఒకరికి గుండె సరిగా పనిచేయదు.. ఇంకొకరికి ఊపిరితిత్తులు, వెన్నుపూస సరిగా లేవు” అంటూ వారి శారీరక దృఢత్వంపై సెటైర్లు వేశారు. వీరు తినే తిండి, వారి ఫిట్‌నెస్ చూస్తుంటే జాలేస్తోందన్నారు.
నాయకుడిపైనా విమర్శలు కేవలం నాని, వంశీలనే కాకుండా పరోక్షంగా వైసీపీ అధినేతను కూడా బుద్దా వెంకన్న టార్గెట్ చేశారు. “కొడాలి నాని, వంశీ వంటి నేతలే ఇంత బలహీనంగా ఉంటే.. ఇక వారి లీడర్ ఇంకెంత బలహీనంగా ఉన్నాడో అర్థమవుతోంది” అని ఎద్దేవా చేశారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు ప్రజా పోరాటాలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.

