ఈ ఏడాది పితృపక్షం ఎప్పుడు.. పితృపక్షంలో ఏం చేయాలి?

మన సనాతన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరు ఆచార వ్యవహారాలను ఎంతో నిష్టగా సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే చనిపోయిన మన పూర్వీకులకు ఆత్మ శాంతి కలిగించడం కోసం ఏడాదికి కొన్ని రోజులపాటు పితృపక్షాలను నిర్వహిస్తారు.ఇలా ఈ పితృపక్షంలో చనిపోయిన వారికి పిండ ప్రదానాలు చేసి వారి పేరిట దానధర్మాలు చేయడం వల్ల వారి ఆత్మ శాంతి కలిగించి వారి చల్లని దీవెనలు మనపై ఉంటాయని భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది పితృపక్షాలు ఎప్పుడు వచ్చాయి అనే విషయానికి వస్తే…

ప్రతి ఏడాది పితృపక్షం భాద్రపద మాస పౌర్ణమి నుంచి ఆశ్వేయుజ మాస అమావాస్య వరకు ఉంటుంది.ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 25 రోజులపాటు ఈ 15 రోజులను పితృపక్షాలు అంటారు. ఈ 15 రోజులపాటు మన పెద్ద వారిని తలుచుకొని వారికి పిండ ప్రదానాలు, దానం, తర్పణం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మ శాంతి కలుగుతుందని భావిస్తారు అలాగే వారి పేరిట దానధర్మాలు చేయడం కూడా ఎంతో ముఖ్యం. ఇకపోతే ఈ పితృపక్షాలలో కేవలం మన పూర్వీకులను మాత్రమే స్మరించుకోవాలి అంతేకాకుండా ఎటువంటి శుభకార్యాలను కూడా చేయకూడదు.

ముఖ్యంగా పెళ్లి నూతన గృహంలోకి ప్రవేశించడం, కొత్త వాహనాలను కొనుగోలు చేయడం వంటి శుభకార్యాలను చేయకూడదు. ఇకపోతే తమ పూర్వీకులు మరణించిన తేదీ తెలియని వారు అమావాస్య రోజున వారి పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం ఎంతో మంచిది.ఇక ఈ పిండ ప్రధానం నిర్వహించిన రోజు పండితులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టడమే కాకుండా వారికి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.