కన్నడ ఇండస్ట్రీలో భారీ చిత్రాలను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా ‘కేడీ ది డెవిల్’ అనే చిత్రం రానుంది. విజనరీ డైరెక్టర్ ప్రేమ్ దర్శకత్వంలో ఈ మూవీని భారీ ఎత్తు తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కన్నడ నేల ఆచార సంస్కృతులు, భారతీయ జానపద గేయాల్లోని అందాన్ని చూపించేలా ‘శివ శివ’ అనే పాటను రిలీజ్ చేశారు.
ఈ పాటను హిందీలో అజయ్ దేవగణ్, తమిళంలో లోకేష్ కనకరాజ్, తెలుగులో హరీష్ శంకర్ రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. అర్జున్ జన్యా బాణీ, విలియం డేవిడ్ కొరియోగ్రఫీ పాటలోని డెప్త్ ఇండియన్ ఫోక్ మ్యూజిక్ గొప్పదనాన్ని చాటి చెబుతున్నాయి. కన్నడలో ఈ పాటను ప్రేమ్, కైలాష్ కేర్ ఆలపించారు. తెలుగు, తమిళంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో ప్రణవం శశి పాడారు. ఇక హిందీలో కైలాష్ కేర్, సలీమా మాస్టర్ కలిసి ఆలపించారు.
కన్నడలో ఈ పాటను మంజు నాథ్ బి.ఎస్, తమిళంలో మదన్ కార్కి, తెలుగులో చంద్రబోస్ హిందీలో రక్విబ్ ఆలం, మలయాళంలో మన్‌కోంబు గోపాలకృష్ణన్ రాశారు. ఆనంద్ ఆడియో లేబుల్ మీద ఈ పాటను మార్కెట్‌లోకి విడుదల చేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిభింబించేలా, భారతీయ జానపద గీతాల్లోని అందాన్ని చూపించేలా ఈ ‘శివ శివ’ అనే పాట సాగుతుంది