సంధ్య థియేటర్లో పుష్ప టు సినిమా ప్రీమియర్ అప్పుడు జరిగిన తొక్కిసలాట గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్ కి రావడంతో అభిమానులందరూ ఎగసిబడి అక్కడికి వచ్చారు ఈ తొక్కిసలాటలో ఒక తల్లి ప్రాణం పోగా కొడుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ సంఘటన తర్వాత ఇంక భవిష్యత్తులో సినిమా స్టార్లు ఎవరు థియేటర్లకు వెళ్లరేమో.
ఇప్పటికే తెలంగాణలో టికెట్ హైక్ లు, బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఉండవు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పేశారు. ఇక అందరి ఆసలు ఆంధ్ర ప్రదేశ్ మీదే ఉన్నాయి. కలెక్షన్లు రావాలన్నా ఏపీలో నుంచి రావాలి. ఇదిలా ఉండగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టడానికి కూడా సినిమా టీం జడుస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలకు ఇది పెద్ద అడ్డకట్టు అనే చెప్పాలి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి రాబోతుంది.
అయితే దీని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఒకటి జరిగింది ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో జరిగేటట్టు సినిమా టీం చూస్తుంది. సాధారణంగా ఏ సినిమాకైనా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అది హైదరాబాద్ లోనే జరుగుతుంది. కానీ మొన్న ఎన్టీఆర్ దేవరకు కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రకటించారు కానీ క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేశారు. మరి ఇంత జరిగిన తర్వాత గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమాలను హైదరాబాద్లో పెట్టే సాహసం చేయరు కనుక అన్ని సినిమాల ఈవెంట్లు ఆంధ్రప్రదేశ్లో జరిగేటట్టే ప్రొడ్యూసర్లు చూస్తున్నారు.
వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాము అనే సినిమాకు మాత్రం చిన్నగా ఒక ఈవెంట్ హైదరాబాద్ లోనే కానిచ్చేసారు. ఎక్కువ మందికి క్రౌడ్ లేకపోవడంతో ఈవెంట్ బానే జరిగింది. ఇదిలా ఉండగా తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ హైక్ లు లేకపోతే అందరి ఆశలు ఆంధ్రప్రదేశ్ మీదే పడతాయి. ఈవెంట్లకైనా సినీ కలెక్షన్లు కైనా ఆంధ్రనే మూలంగా మారేలా ఉంది.