Tollywood singers: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ మంగ్లీ ఒకరు. ఈమె జానపద గేయాలను ఆలపిస్తూ ఎన్నో ఆల్బమ్స్ చేస్తూ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గా కూడా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న మంగ్లీ అనంతరం తన చెల్లిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక తన చెల్లెలు ఇంద్రావతి కూడా సింగర్ గా ఒక్క నైట్ లోనే పాపులర్ అయ్యారు. ఈమె పుష్ప సినిమాలో ఉ అంటావా మామ అనే పాట ద్వారా ఫేమస్ అయ్యారు.
ప్రస్తుతం వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. ఇక ఏదైనా కొత్త పండుగ వస్తుంది అంటే చాలు ఆ పండుగకు సంబంధించి ప్రత్యేక గీతం ద్వారా మంగ్లీ ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అక్క చెల్లెలు ఉన్నఫలంగా రాధా కృష్ణులుగా మారిపోయారు. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన ‘రాధే కృష్ణ రాధే’ అనే పాట విడుదలైంది.
ఈ పాటకి కాసర్ల శ్యామ్, ప్రశాంతి విహారి సంగీతం అందించారు. ఇందులో కృష్ణుడిని ఆరాధించే గోపికలుగా ఎంతో అద్భుతంగా ఆడిపాడుతూ డాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు ఈ వీడియో పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మారుమూల గ్రామంలో జన్మించిన మంగ్లీ ఫోక్ సింగర్‌గా ప్రస్థానాన్ని మొదలు పెట్టి టాప్ సింగర్‌గా ఎదిగింది మంగ్లీ.ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడ తదితర భాషల్లోనూ పాటలు ఆలపిస్తుందామె. ఇక ఈమె బాటలోనే తన చెల్లెలు ఇంద్రావతి చౌహన్ కూడా సింగర్ గా మంచి సక్సెస్ అందుకున్నారు.