Chiranjeevi: ఇండస్ట్రీపై బ్రహ్మాస్త్రం ఎందుకు… పని పాట లేదా… వైరల్ అవుతున్న చిరు వీడియో?

Chiranjeevi: ప్రస్తుతం తెలంగాణలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ విషయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టు కావడం జరిగింది. ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఈ విషయం కాస్త రాజకీయాల పరంగా కూడా చర్చలకు కారణమైంది. ఇకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఈ అంశం గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో ఎంతోమంది రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి రేవంత్ రెడ్డి వాటి గురించి దృష్టి పెడితే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం సినిమా ఇండస్ట్రీ గురించి అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడటం పట్ల తీవ్రస్థాయిలో స్పందించారు. సినిమా ఇండస్ట్రీ గురించి కొంతమంది రాజకీయ నాయకులు పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారు. మరి ఏ పనీపాటా లేనట్టు సినిమాల గురించి మాట్లాడటం ఏంటని ఈయన ప్రశ్నించారు.సినిమాల మీద సినిమాలు చేస్తున్నామంటే మాకు డబ్బులొస్తాయని కాదు సార్.. మా వాళ్లందరికీ ఉపాధి లభిస్తుంది.. వాళ్లంతా హాయిగా ఉంటారని. ఏదో పెద్ద సమస్యలాగా, ఇంతకంటే పెద్ద సమస్య లేదన్నట్లుగా మీరు పార్లమెంటులోనూ మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టకరమనే తెలిపారు.

ప్రస్తుతం మన సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు అంటే అదే రేంజ్ లో డబ్బు ఖర్చు చేస్తున్నామని,ఇలాంటి ఖర్చుకు ఎంతోకొంత రెవెన్యూ రావాలని కోరుకోవడం కూడా సమంజసమే. వీలైతే ప్రభుత్వాలు సహకరించండి. అంతేకానీ అణగదొక్కడానికో.. దీన్నేదో తప్పని దేశవ్యాప్తంగా ఎత్తి చూపుతూ రాజ్యసభల్లోనూ చర్చించకండి. పొలిటీషియన్స్ చాలా పెద్దవారు సినిమా చాలా చిన్నది అంటూ చిరంజీవి మాట్లాడారు.

అయితే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకల్లో భాగంగా ఏపీ ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేశారని తెలుస్తుంది. అయితే అప్పట్లో ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కరెక్టుగా సరిపోయాయని ప్రస్తుతం ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో సంచలనంగా మారింది.