TG: సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన రాజకీయాల పరంగా యూ టర్న్ తీసుకున్న విషయం మనకు తెలిసిందే ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ విషయంపై స్పందిస్తూ రేవంత్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని పెద్దగా చేస్తుందని తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించాడు. అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నదనీ ఈయన వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రఘునందన్ సంచలన విషయాలను తెలియజేశారు.
సాధారణంగా ఏదైనా ధర్నాకు నిరసనలకు వెళ్తే పోలీసులు ముందుగానే మమ్మల్ని అరెస్టు చేస్తారు అలా అల్లు అర్జున్ ని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు అంటూ ఈయన ప్రశ్నించారు. కొందరు పోలీసులు అభిమానంతోనే, లేక ఉత్సాహంతోనో తొందరపడి ఆ రోజు సంధ్య థియేటర్ గేట్లు తెరిచారన్నారు. తొక్కిసలాట చాలా బాధకరమైన విషయమని ఈయన తెలియజేశారు.
ఇక అల్లు అర్జున్ భాదిత కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి అల్లు అర్జున్ తో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం బాధ్యత వహించాలని ఈయన తెలియజేశారు. ఇకపోతే ఈ ఘటన గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం గురించి రఘునందన్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ప్రస్తావన అసెంబ్లీలో మాట్లాడటం సరికాదని ఆయన అసెంబ్లీలో మాట్లాడాల్సింది గురుకుల విద్యార్థుల గురించి అని తెలిపారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి సుమారు 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించారు మరి ఎప్పుడైనా రేవంత్ రెడ్డి వెళ్లి ఆ విద్యార్థుల కుటుంబాలను పరామర్శించావా వారి కుటుంబాలకు నువ్వు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారా అంటూ సూటి ప్రశ్న వేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి కానీ హీరోల గురించి కాదని కేవలం వారి తప్పును కప్పు పుచ్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేశారు అంటూ ఎంపీ రఘునందన్ ఆరోపణలు చేశారు.

