KA Paul: రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా ఫీల్ అవుతున్నాడు… కె.ఏ పాల్ సంచలన వ్యాక్యాలు!

KA Paul: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉందని ఈయన రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దాదాగిరి గుండాయిజం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నిత్యం ధర్నాలు గొడవలు అంటూ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులతో గొడవ జరిగితే రేవంత్ వారికి బేడీలు వేయించు మరి అరెస్టులు చేస్తున్నారు. నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే వారిని అరెస్టులు చేయించి వారి నోర్లు మూయిస్తున్నారు.

ఇక పరీక్షలను వాయిదా వేయాలి అంటే వారి మీద లాఠీ ఛార్జ్ చేయిస్తున్నాడు అంటూ పాల్ ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఇలా రేవంత్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విధంగా నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డి తనని తాను ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్‌లా ఫీలవుతున్నాడు. చట్ట విరుద్దంగా సొంత చట్టం పెట్టి 482 బిల్డింగ్‌లను నోటీసులు ఇవ్వకుండా బిల్డింగులను కూల్చి వేస్తున్నారు కానీ తన సొంత తమ్ముడు బిల్డింగ్ మాత్రం ఇప్పటివరకు కూల్చలేకపోయారు అంటూ కేఏ పాల్ మండిపడ్డారు.

ఈ విధంగా కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుతూ తరచూ వార్తలలో నిలుస్తుంటారు అయితే ఈయన మాట్లాడే ఏ విషయమైనా కరెక్ట్ పాయింట్ పట్టుకొని ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అల్లు అర్జున్ అరెస్టును కూడా కేఏ పాల్ పూర్తిగా ఖండించారు.