YS Sharmila: రాజకీయాలకు షర్మిల రిటైర్మెంట్… కీలక నిర్ణయం తీసుకున్న హై కమాండ్?

YS Sharmila: వైయస్ షర్మిల ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈమె వ్యవహార శైలిపై సొంత పార్టీ సీనియర్ నేతలే పూర్తిస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల మొదటగా తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ కూడా పాదయాత్ర అంటూ పెద్ద ఎత్తున ఈమే హంగామా చేశారు బిఆర్ఎస్ నేతలను పూర్తిస్థాయిలో విమర్శిస్తూ షర్మిల నిరుద్యోగుల పక్షాన పోరాటం చేశారు. ఇలా తెలంగాణలో తన పార్టీని విస్తరింప చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నటువంటి ఈమె కనీసం ఎన్నికలలో పోటీకి కూడా నిలబడకుండా తన పార్టీని మూటకట్టి పక్కన పడేశారు.

ఇలా తెలంగాణలో షర్మిల రాజకీయం అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈమె ఏపీలోకి అడుగు పెట్టారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఏకంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు అయితే ఈమె ఇలాంటి పదవి అందుకున్న వెంటనే తన అన్నయ్య లక్ష్యంగా చేసుకొని తన అన్నయ్య పై పూర్తిస్థాయిలో విమర్శలు కురిపిస్తూ వచ్చారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓటమికి షర్మిల కూడా ప్రధాన కారణం అని చెప్పాలి.

వ్యక్తిగత విభేదాలను దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేస్తూ ఈమె తన పట్ల ఇప్పటికి విమర్శలు చేస్తున్నారు అయితే షర్మిలకు అంత పెద్ద పదవి ఇచ్చిన హై కామాండ్ ఏపీలో కాంగ్రెస్ పార్టీని తిరిగి పుంజుకునేలా చేస్తారన్న కారణంతోనే ఆమెకు అంత పెద్ద పదవి కట్టబెట్టారు కానీ ఈమె మాత్రం తన పదవిని కేవలం తన వ్యక్తిగత విషయాలకు అనుగుణంగా మార్చుకున్నారని తెలుస్తుంది.

ఇక ఏదైనా పార్టీ పరంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే కనీసం సీనియర్ నాయకులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఈమె సోలోగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం పట్ల సీనియర్ నేతలు ఈమె వ్యవహార శైలిని తప్పుపడుతూ హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో హై కమాండ్ షర్మిలకు చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇలా పిసిసి అధ్యక్షురాలిగా విమర్శలను ఎదుర్కొంటున్న షర్మిల రాజకీయాలలో కొనసాగడం కంటే రిటైర్మెంట్ ప్రకటించడమే మంచిది అంటూ పలువురు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం వైకాపా పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలతో సన్నిహితంగా మెలుగుతూ వారిని కాంగ్రెస్ లోకి తీసుకోవాలని ఆలోచనలో ఉందని స్పష్టం అవుతుంది మరోవైపు జగన్ సైతం తన తండ్రి హయాంలో మంత్రులుగా పని చేస్తున్న వారందరినీ హక్కును చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.