మిల్కీ బ్యూటీ తమన్నా పాట.. తెలుగులో కూడా వచ్చేస్తుంది!!

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన స్త్రీ 2 సినిమా ఈ సంవత్సరం బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఏకంగా 800 కోట్లు సంపాదించిన ఈ సినిమా బాలీవుడ్ లో బెస్ట్ హర్రర్ కామెడీగా నిలిచింది. 2018 లో విడుదలైన స్త్రీ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా విడుదలైంది. మొదటి సినిమా పెద్ద హిట్ అవ్వడంతో దాని సీక్వెల్ కి అందరూ చాలా సంవత్సరాలు ఎదురు చూశారు.

విడుదలైన తర్వాత అందరి మనసులు గెలుచుకున్న ఈ సినిమా కలెక్షన్లకు ఇంక అడ్డే లేదు. సినిమాలో శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావులతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తన వంతు పాత్ర పోషించింది. సినిమా హిట్ అవ్వడానికి స్టోరీ, కామెడీలతో పాటు సాంగ్స్ కూడా ఒక కారణమే చెప్పాలి. సినిమాలో విడుదలైన ప్రతి పాట పెద్ద హిట్ అయింది.

అయితే అన్నిటికన్నా సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ఆజ్ కీ రాత్ సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచిపోయింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరికి ఈ పాట తెగ నచ్చేసింది. ఈ పాటకి మిల్కీ బ్యూటీ తమన్నా డాన్స్ పెద్ద ప్లస్ అయింది. ప్రతి ఒక్కరి ప్లే లిస్టులో ఈ సంవత్సరం ఈ పాట ఉండి తీరాల్సిందే అన్నంత పాపులర్ అయింది.

ఈ సినిమా ద్వారా శ్రద్ధ కపూర్ కి ఎంత క్రేజ్ వచ్చిందో తమన్నాకి కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఇంస్టాగ్రామ్ తో సహా సోషల్ మీడియాలలో ఎక్కడ చూసినా ఈ పాట మీద రీల్స్ ఒక రేంజ్ లో రీచ్ అయ్యాయి. అయితే ఈ సినిమా డబ్బింగ్ భాగంగా ఈ పాటను కూడా పూర్తిగా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీడీలో రిలీజ్ అయ్యి మంచి వ్యూయర్షిప్ ని సాధించింది.

Aaj Ki Raat - Telugu Version | Stree 2 | Tamannaah Bhatia | Sachin - Jigar | Deepthi Suresh