TG: తెలంగాణ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ వివాదాన్ని చాలా పర్సనల్ గా తీసుకొని ఆయనను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్టయి జైలుకు రావడం అలాగే అల్లు అర్జున్ గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం కాస్త తారాస్థాయికి చేరుకుంది. ఇలా అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి తీవ్రస్థాయిలో మండిపడుతూ అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు.
ఇలా తన గురించి అసెంబ్లీలో ఇలాంటి చర్చలు జరగడంతో అల్లు అర్జున్ కూడా అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ విషయాన్ని రేవంత్ రెడ్డి ఇలా పర్సనల్గా తీసుకోవడానికి కారణం మరి ఏమీ లేదని ఇచ్చిన హామీల నుంచే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ ఏపీ టీడీపీ మహిళా నేత తిరునగరి జోత్స్న మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కేసు మీద పెట్టిన శ్రద్ధ దృష్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తున్నారు. గురుకులాలలో విద్యార్థులు అనారోగ్యానికి గురై మరణిస్తున్నారు ఇలా ఈ సమస్యలను పట్టించుకోకుండా ఈ విషయాల గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడకుండా అల్లు అర్జున్ కేసు గురించి ఎందుకు మాట్లాడారు. ఇలా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడటం డైవర్షన్ పాలిటిక్స్ అనకా మరేమీ అంటారు అంటూ టిడిపి మహిళా నేత చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.