YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన తాజాగా కడపకి చేరుకున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇడుపులపాయకు వెళ్లి అక్కడ తన తండ్రి సమాధి వద్ద తన తండ్రికి నివాళులు అర్పించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జగన్ అనంతరం ప్రేయర్ హాల్‌లో జరిగిన ప్రార్థనల్లో జగన్ పాల్గోన్నారు. మధ్యాహ్నం ఇడుపుల పాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రి పులివెందులలో బస చేయనున్నారు.
ఇక క్రిస్మస్ పండుగ సందర్భంగా జగన్ కడప పర్యటనకు వచ్చారని తెలుస్తుంది. ఇక డిసెంబర్ 25న ఈయన పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్నారు. ఇలా క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని ఆరోజు మొత్తం కుటుంబంతోనే పలు కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. ఇక 26వ తేదీ పులివెందులలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ నెల 27 న ఉదయం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు.
ఇలా జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు కూడా వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఇలా ఈ మూడు రోజులు పర్యటనలో భాగంగా ఈయన పార్టీ నేతలను కార్యకర్తలను కూడా కలవబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇటీవల కడపలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి నేతలు టిడిపిలోకి వెళ్లడం విషయం గురించి కూడా జగన్ చర్చలు జరపబోతున్నారని సమాచారం.