సంధ్య థియేటర్లో పుష్ప ప్రీమియర్ అప్పుడు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే తన మెయిన్ ఫోకస్ అంతా ప్రస్తుతానికి ఈ సంఘటన మీదే ఉంచుతున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా ఇకపై సినిమా టికెట్లకు రేట్లు పెంచడానికి, బెనిఫిట్ షోలకి కి అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో సినీ నిర్మాతలు అందరికీ ఒక్కసారి గుండెల్లో రాయ పడినంత పని అయింది.
సంవత్సరం అంతటికి సినిమాల లాభాలు అన్ని ఒక ఎత్తు అయితే పెద్ద పండుగకు విడుదలయ్యే సినిమాలకు లాభం ఒక రేంజ్ లో ఉంటుంది. కుటుంబాలు అందరూ తరలివచ్చి సినిమా చూసేది పెద్ద పండుగ రోజుల్లోనే. అలాంటి సంక్రాంతికి బెనిఫిట్ షో లు లేకపోవడం అనేది పెద్ద నిరాసే. అందులోనూ ఈ సంవత్సరం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వెంకటేష్ వంటి పెద్ద హీరోలు సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి. రామ్ చరణ్ సినిమా అంటే కలెక్షన్లు గట్టిగానే వస్తాయి.
అలాంటి అవకాశం ఉన్నప్పుడు బెనిఫిట్ షోలు పెట్టకపోవడంతో వాళ్ళ సినిమా కలెక్షన్లపై ప్రభావం చాలా ఉంటుంది. దీనివల్ల పెద్ద నిర్మాతలు నష్టపోతారు. దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత నిర్మాతలు అందరూ కలిసి రేవంత్ రెడ్డి తో ఈ విషయం గురించి మాట్లాడే అవకాశం ఉండొచ్చు. సినిమా ఎన్ని డబ్బులు కలెక్ట్ చేసిన నైజాం కలెక్షన్లకంటూ ఒక రేంజ్ ఉంటుంది. రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఎన్ని థియేటర్లు ఉన్నా సినిమాకు అసలు కలెక్షన్లు హైదరాబాదు నుంచే వస్తాయి.
అలాంటి హైదరాబాద్ నుంచే బెనిఫిట్ షోలు ప్రైజ్ హైక్లు లేకపోతే సినిమా ఇండస్ట్రీకి లాభాలు గట్టిగానే తగ్గుతాయి. ఈ విషయంపై పెద్ద నిర్మాతలు ఆందోళనగా ఉంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు మాత్రం సంతోషిస్తున్నారు. టికెట్ల రేట్లు తగ్గడం వల్ల ఎక్కువ ప్రేక్షకులు సినిమాకు వచ్చే అవకాశం ఉంది. మళ్లీ సినిమా ధియేటర్లు కలగల్లులాడుతాయి అంటూ చిన్న నిర్మాతలు, థియేటర్ ఓనర్లు హర్షిస్తున్నారు.