ఆయన రచనలు చరిత్రలో నిలిచిపోతాయి.. శ్యాం బెనెగల్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన మెగాస్టార్!

దేశంలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన దిగ్గజ సినీ దర్శకుడు శ్యాం బెనెగల్ నిన్న సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల యావత్ సినీ ప్రపంచం దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఆయన 90 సంవత్సరాల వయసులో కిడ్నీ సంబంధిత వ్యాధితో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న సాయంత్రం మృతి చెందారు. ప్రధానమంత్రి తో సహా రాజకీయ ప్రముఖులు ఆయనకి తమ సంతాపం తెలియజేస్తున్నారు.

ప్రముఖ నటుడు చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా తన సంతాపాన్ని తెలియజేశారు. గొప్ప మేధావుల్లో శ్యాం బెనెగల్ ఒకరిని ఆయన సినిమాలు జీవిత చరిత్రలు డాక్యుమెంటరీలో భారత గొప్ప సాంస్కృతిక సంపదలో భాగమని అన్నారు. మన హైదరాబాది, మాజీ రాజ్యసభ సభ్యుడైన శ్యాం బెనెగల్ రచనలు ఇండియన్ సినీ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోతాయని చెప్పారు. అతను భారత దేశంలోనే ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించారు, అతని ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు చిరంజీవి.

శ్యామ్ బెనగల్ నిశాంత్, మందన్, భూమిక, సర్దార్, బేగం జుబేదా, మండి, త్రికాల, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరమైన సానాన్ని సంపాదించుకున్నారు. 1934లో హైదరాబాదులోనే పుట్టిన శ్యామ్ బెనగల్ కాపీ రైటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి దేశం మెచ్చే దర్శకుడిగా రూపాంతరం చెందారు. ఆయనకి 1976లో పద్మశ్రీ,1991లో పద్మభూషణ్, 2007లో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఈ దిగ్గజ దర్శకుడు అనేక నేషనల్ అవార్డ్స్ ని కూడా అందుకున్నారు.

ఆయన మరణించిన రోజుని బ్లాక్ డే అని చెప్పుకొస్తున్నారు సినీ ఇండస్ట్రీ వారు. 1976లో అమూల్ పాల రైతుల నుంచి రెండు రూపాయలు చొప్పున సేకరించి ఆ నిధులతో మందన్ అనే సినిమాను తీసే సూపర్ హిట్ అందుకున్నారు శ్యామ్ బెనెగల్. కమర్షియల్ సినిమాల ప్రభంజనంలో ఆర్టిఫిషియల్ హీరోలను కాకుండా జీవితాన్ని సమాజంలోని పాత్రలని వాస్తవికంగా తెరపై ఆవిష్కరించిన వ్యక్తి శ్యాం బెనెగల్.