Devotional Tips: అమావాస్య రోజు ముగ్గులు వేయక పోవడానికి గల కారణం ఏమిటో తెలుసా?

Devotional Tips: సాధారణంగా మన హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే ఇల్లు మొత్తం చెత్త ఊడ్చి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేస్తారు. ఇలా ముగ్గు వేయటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని భావిస్తారు. ఇప్పటికీ పల్లెల్లోనూ పట్టణాలలోనూ ఈ విధమైనటువంటి ఆచారం కొనసాగుతూనే వస్తుంది. పట్టణాలలో ఇంటి ముందు కొద్దిగా స్థలం ఉన్నప్పటికీ ఇలా ముగ్గులు వేయడం మనం చూస్తూ ఉంటాము. అయితే అమావాస్య రోజు మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని చెబుతుంటారు. ఇలా అమావాస్య రోజు ముగ్గు వేయకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

పురాణాల ప్రకారం అమావాస్య రోజు మన ఇంటికి పితృదేవతలు వస్తారని చెబుతుంటారు. ఆ సమయంలో పితృదేవతలకు అర్ఘ్యమిస్తే.. వంశాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని భావిస్తారు అందుకోసమే అమావాస్య రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఇంటి ముందు నీళ్లు చల్లినప్పటికీ ముగ్గు మాత్రం వేయకూడదు.ఇలా ముగ్గు వేయటం వల్ల పితృదేవతలు మన ఇంటి లోనికి ప్రవేశించరని పండితులు చెబుతుంటారు.

ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల పితృదేవతలు మన ఇంటి లోపలికి రాకుండా బయటనే ఆగిపోతారు. అందుకోసమే అమావాస్య రోజు ముగ్గు వేయకపోవడం వల్ల పితృదేవతలు ఇంటి లోపలికి వచ్చి మనసారా మనల్ని దీవించి వెళ్తారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పితృదేవతలకు అమావాస్యకు అంటే ఎంతో ప్రీతికరమైనది కనుక అమావాస్య రోజు ప్రత్యేకంగా వారి కోసమే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అలా పితృదేవతల రాక కోసమే అమావాస్య రోజు ముగ్గు వేయకూడదని చెబుతారు.