YS Jagan: తల్లికి ఎదురుపడిన వైయస్ జగన్… తల్లి ప్రేమ చాటుకున్న వైయస్ విజయమ్మ!

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప పర్యటనలో ఉన్నారు నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈయన కడప జిల్లాలో పర్యటించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడ నుంచి ఈయన నేరుగా పులివెందులకు చేరుకున్నారు. అయితే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇడుపుల పాయలో ఇప్పటికే క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ క్రిస్మస్ వేడుకలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఇలా ఈయన ఇడుపులపాయకు చేరుకోగానే తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించారు అనంతరం అక్కడే జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలలో భాగంగా వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. ఇలా తన తల్లికి జగన్ ఎదురుపడటంతో ఆమె తన కొడుకును ఎంతో ప్రేమగా హక్కున చేర్చుకొని తనని ఆశీర్వదించారు.

ఇలా జగన్మోహన్ రెడ్డిని చూడగానే ఒక్కసారిగా తనని హక్కును చేర్చుకున్న విజయమ్మ తనకు ఆశీర్వాదం తెలియజేయడమే కాకుండా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా ఈ వేడుకలలో జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రార్థనల అనంతరం ఆయన పులివెందులకు బయలుదేరారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి విజయమ్మ గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే సొంత కొడుకు తల్లిని బయటకు దొబ్బేసాడు అంటూ వీరిద్దరి గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ జగన్ మోహన్ రెడ్డి గురించి వస్తున్నటువంటి వార్తలను విజయమ్మ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు.

ఇక తాజాగా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని పులివెందులకు జగన్మోహన్ రెడ్డి రావడం తన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇక రేపు పులివెందుల చర్చిలో జరగబోయే క్రిస్మస్ వేడుకలలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు ఇలా డిసెంబర్ 27వ తేదీ ఈయన పులివెందుల నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళబోతున్నారు.