Madhavi Latha: దానం చేస్తూ పోతే హీరోలు అడుక్కు తినాల్సిందే… ఫైర్ అయిన నటి మాధవి లత!

Madhavi Latha: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే అల్లు అర్జున్ ఏమాత్రం లేకపోయిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై కేసు నమోదు చేసి తనని అరెస్టు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ A11 ముద్దాయిగా ఉన్నటువంటి పోలీసులు ఈయనని ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అరెస్టు చేసిన విషయం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా చర్చలకు కారణమైంది.

ఇలా ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించిన అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఇలా అభిమాని మరణించడం చాలా దురదృష్టకరం అయితే ఆ కుటుంబానికి తాను అండగా ఉంటాను అంటూ డబ్బులు ప్రకటించారు. ఇలాంటి తరుణంలోని గతంలో ఎన్టీఆర్ తమ కుటుంబానికి అండగా ఉంటామని ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మాట తప్పారు అంటూ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చారు.

దేవర సినిమా సమయంలో కౌశిక్ అనే ఎన్టీఆర్ వీరాభిమాని తల్లితండ్రులను వేడుకుంటూ ఉన్నటువంటి ఒక వీడియో వైరల్ గా మారింది. క్యాన్సర్ తో బాధపడుతూ చివరి స్టేజ్ లో ఉన్నటువంటి కౌశిక్ తనని ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా చూసే వరకైనా బ్రతికించమని తన తల్లిదండ్రులను కోరారు. అయితే అప్పట్లో ఈ ఘటనపై ఎన్టీఆర్ స్పందిస్తూ తన అభిమానికి వీడియో కాల్ చేసి మరి మాట్లాడారు.

ఇక కౌశిక్ తో మాట్లాడుతూ ఆయన తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని భయపడాల్సిన పనిలేదని ఎన్టీఆర్ భరోసా ఇవ్వడమే కాకుండా తమకు అండగా ఉంటామని చెప్పారు అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని మాకు ఎలాంటి ఆ సహాయం చేయలేదు అంటూ కౌశిక్ తల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు అయితే ఈ విషయంపై నటీ మాధవి లత ఘాటుగా స్పందించారు.

ఈ సందర్భంగా మాధవి లతా మాట్లాడుతూ.. ఈ రకంగా హీరోలందరూ అభిమానులకు డబ్బులు ఇస్తూ పోతే హీరోలు అడుక్కుతినాల్సిందేనని ఈమె కామెంట్లు చేశారు.. హీరోల నుంచి ఇలా డబ్బులు ఆశించేవారు అభిమానులు ఎలా అవుతారు అంటూ ఈమె ప్రశ్నించారు దీంతో మాధవి లత చేసిన వ్యాఖ్యలపై పలువురు విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు