Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మద్యంతర బెయిలు మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ అరెస్టు కావడంతో ఈ విషయం కాస్త ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ అటు రాజకీయాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. ఇకపోతే నేడు అల్లు అర్జున్ తిరిగి పోలీస్ విచారణలో కూడా పాల్గొన్నారు.
మధ్యంతర బెయిల్ మీద ఈయన బయటకు వచ్చారు అయితే నిన్న విచారణకు హాజరు కావాలి అంటూ చిక్కడపల్లి పోలీసులు ఈయనకు నోటీసులు అందజేయడంతో ఈరోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ తన లాయర్లతో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరయ్యారు సుమారు రెండు గంటల వరకు ఈ విచారణ కొనసాగింది ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు.
ఇక అల్లు అర్జున్ గత కొంతకాలంగా ఈ వివాదంలో నిలిచిన సందర్భంలో మీడియా ఆయన ఇంటి ముందట కాపలా కాస్తున్నారు ఈ క్రమంలోనే తన ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనే విషయాలు తెలియకుండా ఉండడం కోసం ఇంటికి అలాగే గేటు ముందు పరదాలు కట్టినట్టు తెలుస్తుంది ఇలా మీడియాకు ఇంట్లో జరిగే విషయాలు తెలియకుండా ఉండడం కోసమే ఇలా పరదాలు కట్టారని తెలుస్తుంది అయితే ఈ పరదాలు కట్టిన రెండు గంటల వ్యవధిలోనే తిరిగి వాటిని తొలగించారు.
ఈ క్రమంలోనే అసలు ఎందుకు అల్లు అర్జున్ ఇంటికి ఇలా పరదాలు కట్టారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక విచారణకు హాజరైన అల్లు అర్జున్ తో పాటు తన లాయర్లు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లారు అదేవిధంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అల్లు అరవింద్ కూడా బన్నీ వెంట పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. మరి పోలీసు విచారణలో భాగంగా పోలీసులు అల్లు అర్జున్ ని ఎలాంటి ప్రశ్నలు వేశారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.