మరొక కొత్త రికార్డుతో పుష్ప2.. దూసుకుపోతున్న కలెక్షన్లు!!

పుష్ప 2 సినిమా ఈ సంవత్సరం విడుదలైన ఇండియన్ సినిమాలు అన్నిటి కన్నా ఎక్కువ కలెక్షన్లు సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే 1500 కోట్లకు పైగా సాధించిన ఈ సినిమా ఇంకా కలెక్షన్లను వసూలు చేస్తూనే ఉంది. అయితే సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన తర్వాత అల్లు అర్జున్ వివాదంలో ఇరుక్కుపోయారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనని చాలా సీరియస్ గా తీసుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సైతం తన ఫోకస్ ని ఈ సంఘటన మీదే చూపుతున్నారు. ఈ విషయంపై అల్లు అర్జున్ అరెస్ట్ అయి తిరిగి బెయిల్ వల్ల బయటకు వచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. మొన్న అల్లు అర్జున్ ఇంటిపై అనామకుల దాడి కూడా జరిగింది. అయితే ఇవేవీ సినిమా కలెక్షన్లకు అడ్డు రావడం లేదు. ఆ కలెక్షన్ల సుడిగాలి ఆగడం లేదు.

రోజుకో కొత్త రికార్డును బద్దలు కొట్టుకుంటూ పుష్ప 2 సినిమా సర వేగంతో దూసుకు వెళ్తుంది. ఇప్పుడు తాజాగా ఇంకో కొత్త రికార్డును కూడా బద్దలు కొట్టింది. బుక్ మై షో లో ఎన్నడూ లేనన్ని విధంగా మొట్టమొదటిసారి ఒక సినిమాకి అత్యధికంగా టికెట్లు సేల్ అవ్వడం పుష్ప 2 సినిమాకే జరిగింది. ఏకంగా పద్దెనిమిది మిలియన్ల టికెట్లు ఇప్పటికే పుష్ప సినిమాపై బుక్ అయ్యాయి.

అంటే 1.8 కోట్ల మంది బుక్ మై షో ద్వారా పుష్ప టు టికెట్లను కొన్నారు. ఇప్పటివరకు ఒక సినిమాకి బుక్ మై షో లో అన్ని టికెట్లు బుక్ అవ్వడం ఇదే మొదటిసారి. ఈ రికార్డుని సినిమా టీం వాళ్ళ అఫీషియల్ పోస్టర్ తో విడుదల చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 1500 కోట్లు సంపాదించిన పుష్ప2 1800 కోట్లను కూడా సంపాదించి లాంగ్ రన్ లో బాహుబలి2 కలెక్షన్ లని దాటుతుందో లేదో చూడాలి.