USA : రాబోయే ఎన్నికల కోసం usa లో పోటీదారులు బాగానే ప్రచారం చేసుకుంటున్నారు, తాను గెలవడం కోసం ఎదుటువారిపై ఎంత బురద జల్లడానికైనా వెనుకాడని అమెరికా అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్తి డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కాడు. నరేంద్రమోడీ నా ఫ్రెండ్ భారత్ తన మిత్రదేశం అని మన దేశంలోనూ పర్యటించి మెచ్చుకున్న ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారంలోకి వచ్చేసారి తన సహజ బుద్దిని చూపించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై నోరు పారేసుకున్నారు. రష్యా చైనా భారత్ వంటి దేశాలు హానికర పదార్థాలను విడుదల చేస్తూ ప్రపంచంలో వాయుకాలుష్యానికి కారణం అవుతున్నాయని ట్రంప్ ఆరోపించారు.
ఇక తన పాలనలో అమెరికాలో పర్యావరణాన్ని పర్యవేక్షిస్తూ శక్తివనరుల స్వయం సంవృద్ధి సాధించానని ప్రచారంలో ట్రంప్ కలగింగ్ ఇచ్చాడు.
ఇక కోటిమందికి పైగా అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తామన్న డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ ప్రకటన అమెరికా సరిహద్దులను చెరిపేసేలా ఉందని ట్రంప్ విమర్శించారు. బైడెన్ గెలిస్తే అమెరికన్లకు అన్యాయం జరుగుతోందంటూ విమర్శలు గుప్పించారు.