నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. నిన్న మొన్న ప్రగతి ఫోటోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి. తన కూతురు పదహారో బర్త్ డే వేడుకల్లో ప్రగతి చేసిన రచ్చకు నెటిజన్లు షాక్ అయ్యారు. కూతురి బర్త్ డే అయినా కూడా అక్కడ హైలెట్ అయింది మాత్రం ప్రగతియే. హాట్ లుక్‌లో దర్శనమిచ్చిన ప్రగతిని చూసి అందరూ షాక్ అయ్యారు. పబ్‌లో స్పెషల్‌గా పార్టీని ప్రగతి ఏర్పాటు చేసింది.
Actress pragathi Modern look goes viral
మోడ్రన్ మదర్ అన్నప్పుడు కనీసం ఆ స్థాయిలో ఉండాల్సిందే కదా. అసలే ఈ మధ్య ప్రగతి సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్. లాక్డౌన్ పెట్టడం ప్రగతికి బాగా కలిసి వచ్చింది. దాని వల్లే ఇప్పడు ఆమె ఫేట్ మారిపోయింది. వస్తోన్న అవకాశాలు, రాస్తోన్న పాత్రలు అన్నీ మారిపోయాయి. ఆమె మాస్ స్టెప్పులు, హెవీ వర్కవుట్లు చూసిన దర్శక నిర్మాతలు దానికి తగ్గట్టు పాత్రలను రాస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం ప్రగతికి ఏడుపు గొట్టు పాత్రలు ఇవ్వడం లేదు. ఏకంగా యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా పెట్టేస్తున్నారు. అందుకే ప్రగతి కూడా వాటికి తగ్గట్టు మరింత మోడ్రన్‌గా తయారవుతోంది. తాజాగా ప్రగతి షేర్ చేసిన ఫోటోను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఎప్పుడూ కూడా స్లీవ్ లెస్ ధరిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ప్రగతి మోడ్రన్ లుక్, ఆ స్టిల్ తెగ వైరల్ అవుతున్నాయి.
అందం.. అభినయం,, అదృష్టం.. ఇవన్నీ కీర్తి సురేష్ సొంతం. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ మహానటి. అయితే ఇప్పుడు తన జీవితంలో అనుకున్న మరో ముఖ్యమైన, సంతోషకరమైన సంఘటన చోటు చేసుకుందని అంటోంది ఈ బ్యూటీ. తన తండ్రి సొంత ప్రొడక్షన్ లో నటించబోతున్నట్లు ప్రకటించింది. ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట్లో సందడి చేస్తుంది. తన ఆనందానికి అవుదులు లేవంటూ.. సంతోషంతో పొంగిపోతుంది. ఒక కూతురిగా ఇంతకంటే ఏం కావాలంటూ సంబరపడుతోంది. అసలు వివరాల్లోకి వెళ్తే..
తన సినీ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేసానని అంటుంది కీర్తి సురేష్. కాకపోతే తన తండ్రి ప్రొడక్షన్ లో రాబోతున్న ఈ సినిమా మాత్రం తనకు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందని అంటుంది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ నిర్మిస్తున్న సినిమాకి వాషి అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో టోవినో థామస్ హీరోగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మలయాళంలో తెరకెక్కుతుంది. దీంతో తన ఏడేళ్ళ కల.. ఇప్పుడు నిజమవుతుందని.. ఈ సినిమా తనకు హార్ట్ టచింగ్ ఉంటుందని తన సోషల్ మీడియాలో అకౌంట్ లో తెలియజేసింది. ఒక కూతురిగా ఇంతకు మించిన అచీవ్ మెంట్ లభించదని ఎమోషనల్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి అంత తేలికగా రాలేదని.. తన టాలెంట్ ని ప్రదర్శించడానికి తాను ఎంతో కష్టపడ్డానని అన్నారు. వాషి సినిమాతో తనకు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ.. బిజీగా ఉన్నారు. దీంతో పాటు నితిన్ కు జోడిగా రంగ్ దే సినిమాలో.. అలాగే గుడ్ లక్ సఖి సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని కథల్ని వింటూ.. స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.
తనయుడు నారా లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు మొదట్లో ఏదేదో ఊహించుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపకుండా ఎమ్మెల్సీని చేసి తరవాత మంత్రిని చేసేశారు. ఒకేసారి మంత్రి అయిపోతే కుమారుడు రాజకీయ క్షేత్రాన్ని దున్నిపారేస్తాడని ఆశపడ్డారు. కానీ సీన్ తిరగబడింది. లోకేష్ దున్నడం కాదు కదా బొక్కబోర్లాపడ్డారు. అధికారాన్ని, పదవిని సద్వినియోగం చేసుకోలేక జనం దృష్టిలో సాదాసీదా నాయకుడిగా మిగిలిపోయారు. ప్రజలకు దగ్గరవ్వడంలో, వైసీపీని ధీటుగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. దీంతో ఖంగుతినడం బాబుగారి వంతైంది.
Main reason behind changeover in Nara Lokesh behaviour
ఎన్నికలకు ముందు కుమారుడ్ని ఎలాగైనా సానబెట్టాలని బాబుగారు బాగా కష్టపడ్డారు. అవేవీ సత్పలితాలని ఇవ్వలేదు. కానీ ఓటమి మాత్రం ఆయనకు చాలా పాఠాలే నేర్పింది. చాలామంది నాయకుల్లా తాను కూడ ఓడిపోవడం లోకేష్ ను ఆలోచనలో పడినట్టే ఉంది. ఆ ఓటమితో చంద్రబాబు కుమారుడనే ప్రతిష్ట దెబ్బతింది. వైసీపీ వేసిన అవహేళన ముద్రకు మరింత బలం చేకూరినట్టైంది. అందుకే లోకేష్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఓటమి నుండే పైకి ఎదగాలని ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. గతంలో మాదిరి ఎవరో బ్రీఫింగ్ ఇస్తే పరిస్థితుల గురించి, రాజకీయాల గురించి తెలుసుకోవడం మానేశారు. స్వయంగా అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. సొంతగా సమీక్షలు చేసుకుంటున్నారు.
గతంలో మాదిరి అన్నింటికీ తండ్రి పక్కన నిలబడటం కాకుండా తానే బాధ్యతలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఒంటరిగానే పర్యటనలు చేయడం స్టార్ట్ చేశారు. కేసుల్లో ఇరుక్కుని అరెస్టైన నేతలను ఒక్కరే వెళ్లి పరామర్శించారు. వర్షాలతో నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లి మంచే చెడు కనుకకుంటున్నారు. పార్టీ వర్గాలతో సమావేశాలు జరుపుతూ ఎలా ముందుకెళ్లాలనే విషయంలో సొంత నిర్ణయాలను చెబుతున్నారు. కొంచెం విషయ పరిజ్ఙానం కనబరుస్తున్నారు. పాలక వర్గం సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలను సంధిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. ప్రతి విషయాన్నీ పెద్దది చేయడం ఎలాగో నేర్చుకుంటున్నారు.
ఇలా లోకేష్ బాబులో వచ్చిన మార్పుకు నేతలే కాదు చంద్రబాబు సైతం ఆశ్చర్యపోతున్నారట. ఏళ్లతరబడి ముందుకు తోసినా పుంజుకోలేకపోయిన లోకేష్ ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే మారిపోయి రాటుదేలిపోవడం చూసిన టీడీపీ లీడర్లకు, చంద్రబాబుకు ఆశలు చిగురిస్తున్నాయి. భవిష్యత్తులో నిర్భయంగా పార్టీ పగ్గాలను అందించవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. మరి ఈ పెను మార్పుకు కారణం ఏమిటయ్యా అంటే వరుసగా తగిలిన ఎదురుదెబ్బలేనని, ఆ గాయాలే లోకేష్ ను రాటుదేల్చాయని టీడీపీ ముఖ్య నేతల పరిశీలనలో తేలిందట. పవర్ ఉన్నప్పుడు గాల్లో తేలిన ఆయనకు ప్రతిపక్షంలో పడ్డాక గ్రౌండ్ రియాలిటీ తెలిసొచ్చిందని, సొంత ఇమేజ్ తాలూకు ప్రాముఖ్యత అవగతమైందని అదే ఈ మార్పుకు కారణమని చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆపాలని ఎంతగానో ప్రయత్నించిన పంచాయతీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీంతో వాదులాటకు చెక్ పెట్టి పోటీకి రెడీ అవుతోంది వైసీపీ. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎంతో ఉత్సాహంగా ఎన్నికల బరిలోకి దూకుతోంది. ఇప్పటికే సమీక్షలు, సమావేశాలు, అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకునే పనులు మొదలయ్యాయి. దీంతో జగన్ సైతం పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టారట. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తోంది. నిజం చెప్పాలనే ఈ రెండేళ్లు ఆయన పార్టీని పెద్దగా పట్టించుకున్నది లేదు. అసలు గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలను ఆయన కలివలేదనే టాక్ కూడ ఉంది.
YS Jagan to review three leaders work
పార్టీ వ్యవహారాలన్నింటినీ కోటరీ నాయకులే చూసుకుంటున్నారు. జగన్ గత ఏడాది మధ్యలోనే మొత్తం జిల్లాలను మూడు భాగాలుగా విభజించి ముగ్గురు నాయకులకు అప్పగించారు. ర్నూల్, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల భాద్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించిన సీఎం ఉభయగోదావరి జిల్లాలు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు భాద్యతలను సొంత బంధువు వైవీ సుబ్బారెడ్డికి అలాగే శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల భాద్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. జిల్లాల రాజకీయాలన్నీ వీరి కనుసన్నల్లోనే నడిచాయి. పార్టీ పరంగా ఏది చేయాలన్నా వీరి ఆమోదం ఉండాల్సిందే. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరి ఆదేశాల ,మేరకే నడుచుకుంటున్నారు.
అయితే నిత్యం పార్టీలో ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. సొంత నాయకుల్లోనే బోలెడన్ని వర్గ విబేధాలు బయటపడ్డాయి. బహిరంగంగానే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పైచేయి సాధించే ప్రయత్నాలు జోరుగా సాగాయి. ఫలితంగా నేతలు వార్తల్లో నిలవాల్సి వచ్చింది. అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు కానీ పాలన పరమైన, క్రమశిక్షణకు సంబంధించిన విమర్శలే అధికంగా ఉన్నాయి. చాలామంది లీడర్లు నోటి దురుసుతో జనం అసహనానికి గురయ్యారు. అభివృద్ధి జరగలేదనే ఆగ్రహం జనంలో ఉంది. పైపెచ్చు వాలంటీర్ వ్యవస్థ మూలాన నాయకులకు ప్రజలకు ప్రత్యక్ష సంబంధం లేకుండా పోయింది. తెలుగుదేశం, జనసేనలు ఎంతో కొంత పుంజుకున్నాయి. ఈ కారణాల వలన స్థానిక ఎన్నికలు వైసీపీకి నల్లేరు మీద నడక మాత్రం కాదనేది స్పష్టమవుతోంది.
అందుకే జగన్ బాధ్యతలు అప్పగించిన ముగ్గరు నాయకుల పర్నితీరు మీద పూర్తిస్థాయి సమీక్ష చేసుకుంటున్నారట. ఎవరి పనితీరు ఎలా ఉంది, ఎక్కడెక్కడ పార్టీ బలపడింది, ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఈ రేండేళ్లలో జనం అభిప్రాయంతో ఎలాంటి మార్పులు వచ్చాయి లాంటి విషయాలను బేరీజు వేసుకుంటున్నారట. ఈ సమీక్షల ఫలితంగానే జగన్ పంచాయతీ ఎన్నికల కార్యాచరణను రూపొందించుకోనున్నారట.
Rashmi Gautam Telugu popular Actress, Rashmi Rashmi Gautam Republic Day Pics, Tollywood Rashmi Gautam And Sudigali sudheer Republic Day Pics at Shoot, Rashmi Gautam , Rashmi Gautam Republic Day Pics in Photoshoot, Rashmi Gautam Sudigali sudheer Republic Day Pics ,
Rashmi Gautam Republic Day PicsRashmi Gautam Republic Day PicsRashmi Gautam Republic Day PicsRashmi Gautam Republic Day PicsRashmi Gautam Republic Day PicsRashmi Gautam Republic Day PicsRashmi Gautam Republic Day PicsRashmi Gautam Republic Day PicsRashmi Gautam Republic Day PicsRashmi Gautam Republic Day PicsRashmi Gautam Republic Day Pics
జక్కన్న దర్శకత్వం లో తెరకెక్కిన బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి చేరిన ప్రభాస్, ఫాలోయింగ్ పరంగానూ దూసుకెళుతున్నాడు. ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అవుతున్నవారి సంఖ్య తాజాగా 6 మిలియన్లకు చేరింది. ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ప్రభాస్ 6 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషం.
మిగతా హీరోలతో పోల్చితే ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం తక్కువే అయినా, ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉండడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్ చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చే సినిమా కూడా హై బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది.
ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం చాలా అరుదు. తన సినిమా అప్ డేట్ల గురించి అప్పుడప్పుడు స్పందిస్తుంటాడు. కాగా, ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయానికొస్తే… టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ 10.4 మిలియన్ల ఫాలోవర్లతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో అల్లు అర్జున్ (10.2 మిలియన్లు), మహేశ్ బాబు (6.4 మిలియన్లు) ఉన్నారు.
కేజీఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్. యష్ హీరోగా కేజీఎఫ్ అనే చిత్రాన్ని తెరకెక్కించి కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ సినీ పరిశ్రమ స్థాయిని కూడా పెంచాడు. బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల వసూళ్ళు రాబట్టిన కేజీఎఫ్ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 మూవీ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్‌తో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు.
అయితే కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్- హోంబలే ఫిలింస్ సంయుక్తంగా సలార్ అనే మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనుండగా, ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఆ కార్యక్రమానికి యష్ కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి నుండి మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుండగా, చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. కేజీఎఫ్ చిత్రాన్ని బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ సలార్ మూవీని బొగ్గు గనుల నేపథ్యంలో చిత్రీకరించనున్నట్టు టాక్.
రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో ఓ పది రోజుల పాటు చిత్ర షూటింగ్ జరపాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్ పనులు ప్రారంభించారు. సెట్టింగ్ పనులు పూర్తి కాగానే చిత్ర బృందం అక్కడ వాలనుంది. ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారు. చిత్ర బృందానికి సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు సమాచారం . హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు కేజీఎఫ్ హీరో యశ్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు.
వలస విధానాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ వివాదాస్పద నిర్ణయాలనే తీసుకున్నారన్న విమర్శలు ఉండేవి. విదేశీయులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్1బీ వీసాలపై పరిమితి పెట్టడం, అమెరికా పౌరసత్వం ఇచ్చే గ్రీన్ కార్డులపై తిరకాసులు పెట్టడం వంటివి చేశారు.
అంతేకాదు.. హెచ్1బీ వీసాదారుల భార్యలు/భర్తలు ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చే హెచ్4 వీసాలపైనా 2019 ఫిబ్రవరిలో ఆయన ఆంక్షలు పెట్టారు. వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకుంటూ ఉత్తర్వులు పాస్ చేశారు. అయితే, దాదాపు రెండేళ్ల తర్వాత ఆ ఉత్తర్వులు ఇప్పుడు రద్దయిపోయాయి. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ట్రంప్ పాస్ చేసిన ఆ ఆదేశాలను నిలిపేశారు.
హెచ్4 డిపెండెంట్ స్పౌజెస్ ను ఉద్యోగార్హుల జాబితా నుంచి తీసేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బిజినెస్ పరిశీలించింది. బైడెన్ వచ్చాక వాటన్నింటినీ 60 రోజుల వరకు ఆపేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు లక్ష మంది హెచ్4 వీసాదారులకు లబ్ధి చేకూరనుంది.
బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి శశికళ విడుదలయ్యారు. జయలలిత మరణానంతరం అవినీతి కేసులో చిన్నమ్మ నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించారు. అయితే ఆమె అనారోగ్యం దృష్ట్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే ఈ విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు.బెంగళూరు పరప్పన జైలు నుంచి శశికళ రిలీజ్ కానున్నారు. ఈ మేరకు అధికారులు ఆమెకు అధికారిక పాత్రలను అందజేశారు.
ఇటీవల, శశికళకు కరోనా సోకడంతో ఆమెను జైలు సిబ్బంది ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన శశికళ విడుదలవుతున్నట్లుగా ఉన్న విడుదల పత్రాలను జైలు అధికారులు ఆసుపత్రిలో ఆమెకు అందించారు. ఇక ఇదే సమయంలో చెన్నైలో లలిత స్మారక మందిరాన్ని పళనిస్వామి, పన్నీల్ సెల్వం ఇద్దరు ఓపెన్ చేశారు. అయితే శశికళ విడుదల రోజే స్మారక మందిరం ప్రారంభం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక ఆమె తిరిగి పార్టీలోకి వచ్చినా సరే చేర్చుకునే లేదంటూ ఇప్పటికే పళనిస్వామి తేల్చిచెప్పారు. దీంతో ఆమె వచ్చాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అనే అంశం ఇప్పుడు తమిళనాట ఆసక్తికరంగా మారింది. ఆస్పత్రి వర్గాలతో చర్చించి డిశ్ఛార్జిపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తెలిపారు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఖలిస్తాన్ తీవ్రవాదులే ఎర్రకోట రగడకు కారణమా.? దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎర్రకోటపై ఓ మతానికి చెందిన జెండా ఎగురవేయడం ద్వారా ఖలిస్తాన్ టెర్రరిస్టులు తమ పైత్యాన్ని ప్రదర్శించారా.? ఇప్పుడు ఈ ప్రశ్నల చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత కొన్ని నెలలుగా ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఇటీవల తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ రైతులు సుదీర్ఘమైన ఆందోళన షురూ చేసిన విషయం విదితమే. కేంద్రం పలు దఫాలుగా ఇప్పటికే రైతులతో చర్చించింది. ఏడాదిన్నరపాటు అవసరమైతే చట్టాల అమలు నిలిపివేస్తామనీ కేంద్రం ప్రతిపాదించింది. అయితే, రైతులు మాత్రం ఆ చట్టాలను పూర్తిస్థాయిలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న ఆందోళన అనూహ్యంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Khalistan militants the cause of the Red Fort riots?
‘నిజమైన రైతులంతా తిరిగి ఢిల్లీ శివార్లలోని ఆందోళన కోసం ఏర్పాటు చేయబడిన శిబిరాలకు చేరుకోవాలి’ అని రైతు సంఘాల నేతలు పిలుపునిస్తున్నారు. నిజానికి, రైతు శాంతి కాముకుడు. రైతు అనేవాడెవడూ విధ్వంసాలను కోరుకోడు. రైతు ఆందోళన చేస్తున్నది తన పొట్ట నింపుకోవడానికి, పది మంది పొట్ట నింపడానికి. ఖచ్చితంగా ఢిల్లీ ఉద్రిక్తతల వెనుక ఖలిస్తాన్ వేర్పాటువాదుల కుట్ర వుండే వుండాలి. ఆందోళనకారుల్లో సున్నిత మనస్కుల్ని, విపరీత స్వభావం వున్నవారిని ఖచ్చితంగా ఎవరో తప్పదోవ పట్టించే వాుండాలి. వాళ్ళ కారణంగానే ఎర్రకోటపై రైతు జెండాతోపాటుగా, ఓ మతానికి చెందిన జెండాని ఎగురవేసి వుండాలి. ‘అబ్బే, అది ఓ మతానికి చెందిన జెండా కాదు..’ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సినీ నటుడు సిద్దు చెబుతున్నప్పటికీ, ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ చేపట్టాలని, నిజాల్ని నిగ్గు తేల్చాలని ఢిల్లీ పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయనీ, రైతులెవరూ ఆ ట్రాప్‌లో పడకూడదని రైతు సంఘాలు పిలుపునిస్తున్న దరిమిలా.. ఉద్యమం మళ్ళీ శాంతియుతమార్గం వైపు మళ్ళుతుందనే భావించాలేమో. ‘మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. విధ్వంసాలని అస్సలు ప్రోత్సహించబోం. మేం, కేవలం కొత్త వ్యవసాయ చట్టాల రద్దుని కోరుతున్నాం..’ అని రైతు సంఘాల నేతలు కుండబద్దలుగొట్టేశారు. ‘కావాలనే, ట్రాక్టర్ల ర్యాలీని తప్పుదారిలోకి మళ్ళించారు..’ అన్నది రైతు సంఘాల వాదనగా కనిపిస్తోంది.
నేచురల్ స్టార్ నాని సినిమా ఒక వివాదంలో ఇరుక్కుంది. దర్శకుడు తొందరపడి తీసుకున్న నిర్ణయానికి హీరో అలాగే నిర్మాతలు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండస్ట్రీ పెద్దలు కూడా రంగంలోకి దిగుతున్నట్లు టాక్ వస్తోంది. నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
టక్ జగదీష్ అనంతరం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే..సుందరానికి.. అనే సినిమా చేస్తున్నాడు. అయితే దర్శకుడిపై ఒక నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో పిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ ఆత్రేయ మొదటి సినిమా మెంటల్ మదిలో. ఆ సినిమాను నిర్మించింది రాజ్ కందుకూరి. అయితే ఆ సినిమా తరువాత కమిట్మెంట్ ప్రకారం దర్శకుడు ఆ నిర్మాతతోనే రెండవ సినిమా చేయాలి.
అయితే వివేక్ ఆ తరువాత మరో ప్రొడక్షన్ లో బ్రోచేవారేవరురా అనే సినిమా చేశాడు. అప్పుడు పెద్దగా పట్టించుకోని రాజ్ కందుకూరి ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. వివేక్ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ లో అంటే సుందరినికి అనే సినిమా చేస్తున్నాడు. దీంతో సినిమా షూటింగ్ పట్టాలెక్కిన తరువాత రాజ్ కందుకూరి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు పిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ వివాదాన్ని వీలైనంత వరకు సాల్వ్ చేయాలని అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
విదేశాలలో మొదలైన బిగ్ బాస్ కార్యక్రమం ముందుగా మన దేశంలో హిందీలో ప్రారంభమైంది. సల్మాన్ హోస్ట్‌గా రూపొందిన ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. దీంతో మిగతా ప్రాంతీయ భాషలలోను బిగ్ బాస్ కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా పలు భాషలలో అలరిస్తున్న బిగ్ బాస్ షో తెలుగులో మాత్రం నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. తొలి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యాతగా ఉన్నాడు. ఇక మూడు, నాలుగు సీజన్స్‌ని నాగార్జున హోస్ట్ చేశారు. కంటెస్టెంట్స్‌గా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు నటీనటులు, సింగర్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతుండగా, ఈ షోతో వారికి దక్కుతున్న గుర్తింపు అంతా ఇంతా కాదు.
బిగ్ బాస్ షోకు వచ్చి వెళ్లిన చాలా మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. ఈ షోకు ముందు పెద్దగా గుర్తింపు లేని వారికి ఇప్పుడు అనేక ఆఫర్స్ కూడా తలుపుతుండడం ఆనందాన్ని కలిగిస్తుంది. సీజన్ 4తో సోహెల్, మెహబూబ్, మోనాల్, అఖిల్, అరియానా వంటి వారు స్టార్ సెలబ్రిటీలుగా మారారు. అయితే సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న అలీ రెజా మధ్యలో నిష్క్రమించి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన సంగతి తెలిసిందే. విన్నర్ కాకపోయిన మంచి ఆదరాభిమానాలు దక్కించుకున్నాడు. బిగ్ బాస్ షో తర్వాత మనోడి రేంజ్ ఎక్కడికో వెళ్లింది.
హ్యూమన్ బుల్డోజర్, బుల్లితెర అర్జున్ రెడ్డి, యాంగ్రీ యంగ్ మెన్ అంటూ పలు ట్యాగ్‌లను తెచ్చుకున్న అలీ రెజా రీసెంట్గా నాగార్జున నటించి వైల్డ్ డాగ్ సినిమాలో ముఖ్య పాత్ర కూడా పోషించాడు. అలానే కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలోను నటిస్తున్నాడు. చేతినిండా పలు ఆఫర్స్‌తో బిజీగా ఉన్న అలీ రెజాకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నిండుగానే ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఇటీవల ఓ అపార్ట్మెంట్ కొంటున్నట్టు చెప్పుకొచ్చాడు. తాజాగా అలీ ఓ కొత్త కారును కొన్నాడు. ఆ కారులో తెగ షికార్లు కొడుతున్నాడు. తాజాగా ఆయన షేర్ చేసిన కారు ఫొటో వైరల్ అవుతుంది. ఆ మధ్య బిగ్ బాస్ ఫేం హిమజ, శివ జ్యోతి కూడా కొత్త కార్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరు ఇలా కార్లు కొనడాన్ని చూసి అభిమానులు ఆనందిస్తున్నారు .
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గతంలో జగన్ సర్కారు అండగా ఉందన్న ధీమాతో బిజినెస్ రూల్స్‌ను కూడా పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు సైతం ఇప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆగ్రహానికి గురవుతున్నారు. వీరి విషయంలో సరైన సమయంలో చర్యలు తీసుకుంటానని ప్రకటించిన నిమ్మగడ్డ వరుసగా కొరడా ఝళిపిస్తున్నారు.యితే తాజాగా ఎస్ఈసీ అభిశంసనకు గురైన ఇద్దరు అధికారులను ఎన్నికలు ముగిశాక కాపాడతామని జగన్ సర్కారు ఇస్తున్న హామీ వాస్తవ రూపం దాల్చడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తున్న సమయంలోనే గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్రి నిర్వాకంతో రాష్ట్రంలో 3.6 లక్షల మంది ఓటుహక్కు ఉండి కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిపై సరైన సమయంలో చర్యలు తప్పవన్నారు. అనుకున్నట్లుగానే సుప్రీంకోర్టు తీర్పు రాగానే వీరిపై కొరడా ఝళిపించారు. కేవలం బదిలీతో సరిపెట్టకుండా రాష్ట్ర స్దాయిలో అరుదుగా వాడే అభిశంసన ద్వారా వీరిద్దరి సర్వీసు రికార్డుల్లో బ్లాక్ మార్క్ వేసేశారు. దీంతో వీరి కెరీర్‌కు ఇదో మచ్చలా మారే ప్రమాదం కనిపిస్తోంది.
కేంద్రానికి డిప్యుటేషన్ కు వెళ్లేందుకు ఏడాది ఆగాల్సి ఉంటుంది. అలాగే ప్రమోషన్లు ఇవ్వడం కూడా కష్టమే. ఇంకా ఎన్నో విషయాల్లో వీరికి ప్రభుత్వం తరఫున ఏ ప్రయోజనం పొందాలన్నా ఇది అడ్డుగా నిలుస్తుంది. కేంద్రం జోక్యం చేసుకుని ఈ మచ్చ తొలగిస్తే తప్ప వీరికి తిరిగి యథావిధిగా డిప్యుటేషన్లు, ప్రమోషన్లు, ప్రయోజనాలు లభించవు. పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా రాష్ట్రంలో 3.6 లక్షల మంది కొత్త ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేసిన వ్యవహారంలో ఎస్ఈసీ అభిశంసనకు గురైన ఐఏఎస్‌లు జీకే ద్వివేదీ, గిరిజాశంకర్‌లకు జగన్ సర్కారు అభయమిస్తోంది. ఏ అధికారికీ అన్యాయం జరగనివ్వబోమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి భరోసా ఇచ్చారు. వారి విశ్వసనీయతను, ఆత్మస్ధైర్యాన్ని కాపడతామన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పీఅర్సీ నివేదిక విడుదల అయింది. తొలి వేతన సవరణ నివేదికను పీఅర్సీ నివేదికను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. దీని ప్రకారం ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు 7.5 శాతం ఫిట్మెంట్ పెంపును ప్రతిపాదించింది. అంతేకాకుండా కనీస వేతనం రూ. 19 వేలుగా.. గరిష్ట వేతనం రూ. 1.62 లక్షలుగా ఉండాలని పీఅర్సీ రిపోర్ట్ పేర్కొంది.
అటు హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 24 శాతానికి కుదించింది. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. కాగా, ఈ అంశంపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాలు భేటి కానున్నాయి. ఉద్యోగుల సమస్యలతో పాటు పీఆర్సీ నివేదికపైనా ఇరు వర్గాలు చర్చించనున్నాయి.
పీఆర్సీ చేసిన ప్రతిపాదనలు:
మూల వేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్
ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలు
ఉద్యోగం గరిష్ఠ వేతనం రూ. 1,62,070
ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు
గ్రాట్యూటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు
మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. అదే జీహెచ్ఎంసీలో మహిళలకు వాహనాలు అందించి ఉపాధిని కల్పించే పథకం .. మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ స్కీమ్. దీనిలో భాగంగా చేపలు, చేపల వంటకాల విక్రయానికి మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో మహిళల ఉపాధి కల్పన చర్యల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ పథకం కింద జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 డివిజన్లకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 150 సంచార చేపల విక్రయ వాహనాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో వాహనం ఖరీదు రూ.10 లక్షలుగా ఉంది. అయితే, ఈ వాహనాల కొనుగోలుకు అయ్యే ఖర్చులో ప్రభుత్వం 60 శాతం సబ్సిడీని లబ్దిదారులకు అందజేయనుంది. గ్రూపులుగా ముందుకు వచ్చే మహిళలకు వీటిని అందజేయనున్నారు.
కాగా, ఇప్పటికే గ్రామాల్లో మత్స్యకారులకు టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలు సబ్సిడీ మీద ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో జీహెచ్ఎంపీ పరిధిలోని మహిళల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చామని తెలిపింది. అలాగే, తాజా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతో పాటు, వాటి విక్రయం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంభన పొందేలా చేయడమే ఈ మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.
యాంకర్ గా బుల్లితెరపై దశాబ్ద కాలంగా ఎంతగానో క్రేజ్ అందుకుంటున్న ప్రదీప్ మాచిరాజు మొత్తానికి వెండితెరపై కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వడబికి సిద్ధమయ్యాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ 29కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన బజ్ అయితే బాగానే ఉంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ యాంకర్ ఎంతవరకు వసూళ్లను అందుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.
ప్రదీప్ కు యూత్ లో అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాని టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన వారు అంతగా సక్సెస్ అవ్వలేదని పాత రికార్డులు చెబుతున్నాయి. కానీ ప్రదీప్ మాత్రం సినిమా కంటెంట్ పై గట్టి నమ్మకంతో ఉన్నాడు. పైగా సినిమా సాంగ్ ఏ రేంజ్ లో క్రేజ్ అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల వచ్చిన ట్రైలర్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రదీప్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.8కోట్లు. సినిమాను తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అయితే ప్రదీప్ మొదటి సినిమా కాబట్టి ఈ మార్కెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 4.4కోట్లు. పాటలాగానే సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావాలి. మరి ప్రదీప్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది .ఇక ఈ నేపధ్యంలో నిన్న వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీలు కూడా పాల్గొననున్నారు.
కాన్ఫరెన్స్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. పంచాయతీల్లో నామినేషన్లకు ఏర్పాట్లు, ఓటర్ల జాబితా రూపకల్పన తదితర అంశాలపై నిమ్మగడ్డ చర్చించనున్నారు. పంచాయతీల్లో భద్రతా పరమైన అంశాలపై సమావేశంలో ఎస్ఈసీ చర్చించనున్నారు. అయితే ఎన్నికలు సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు. ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. కాజల్ అగర్వాల్ కథానాయిక. కరోనా వలన ఆగిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 2021లో ఈ చిత్రం విడుదల కావడం పక్కా. ఇటీవల రామ్ చరణ్ సెట్స్ లోకి అడుగుపెట్టగా, ఆయన ప్రీలుక్ విడుదల చేసి మూవీపై మరిన్ని అంచనాలు పెంచారు. అయితే అప్పుడెప్పుడో పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయే సరికి ఫ్యాన్స్ నిరూత్సహంలో ఉన్నారు. దీనిని అర్దం చేసుకున్న చిరంజీవి టీజర్ రిలీజ్ డేట్ చెప్పకపోతే నేనే లీక్ చేస్తానంటూ కొరటాలకు వార్నింగ్ ఇచ్చాడు.
ఆగస్ట్ 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆచార్య మోషన్ పోస్టర్ విడుదలైంది. దానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. న్యూ ఇయర్ కానుకగా ఆచార్య టీజర్ వస్తుందని అనుకున్నారు.. కానీ రాలేదు. సంక్రాంతికి అనుకున్నారు అది జరగలేదు, కనీసం రిపబ్లిక్ డేకు అయిన వస్తుందేమో అని మెగా ఫ్యాన్స్ ఆశగా చూశారు. అది జరగలేదు. దీంతో ఓ మీమ్‌తో చిరు కొరటాలకు చురక అంటించారు. దీంతో టీజర్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది కొద్ది సేపటి క్రితం ప్రకటించారు.
జనవరి 29న ఆచార్య టీజర్ విడుదల కానుందంట మేకర్స్ అఫీషియల్‌గా తెలియజేశారు. దీంతో అందరి దృష్టి 29న పడింది. ఆ రోజు సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు ఆచార్య టీజర్ రచ్చ చేయనుంది. సామాజిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కు పసందైన వినోదం అందిస్తుందని అంటున్నారు. ఈ చిత్రంలో చరణ్ నక్స్‌లైట్‌గా కనిపించనున్నాడని తెలుస్తుండగా, ఆయన సరసన పూజా హెగ్డే కథానాయిక అని తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్లో మూవీని విడుదల చేయనున్నారు.
బుల్లితెరపై ఎన్నో యేళ్ల నుంచి సీరియల్స్‌లో నటించిన వర్షకు సరైన గుర్తింపు రాలేదు. నెగెటివ్ రోల్స్, సహాయక పాత్రలు చేస్తూ పలు సీరియల్స్‌లో నటించింది. కానీ వర్షకు ఎన్నడూ కూడా సరైన గుర్తింపు రాలేదు. అలా వర్ష ఎప్పుడైతే జబర్దస్త్ స్టేజ్ మీద కనిపించడం ప్రారంభించిందో అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా జనాల్లోకి వెళ్లింది. వర్ష అనే ఓ బుల్లితెర అందాన్ని గుర్తించడం ప్రారంభించారు. అలా మొత్తానికి జబర్దస్త్ మాత్రం వర్షను బాగానే పాపులర్ చేసింది.
Jabardasth varsha Bold Pics Goes viral
హైపర్ ఆది స్కిట్లో మొదటగా కనిపించింది. కానీ గుర్తింపు తెచ్చింది.. వచ్చింది మాత్రం ఇమాన్యుయేల్ వల్లే. ఇమాన్యుయేల్ పక్కన పాల తెలుపు అందంతో మెరవడంతో వర్షకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. అలా కెవ్వు కార్తీక్, ఇమాన్యుయేల్ స్కిట్లో వర్ష నటించి మంచి ఇమేజ్ను, క్రేజ్‌ను తెచ్చుకుంది. ఇక వర్ష ఇమాన్యుయేల్ అనే కొత్త జంట జబర్దస్త్‌పై పురుడు పోసుకుంది. ప్రోమోలు ఈ ఇద్దరిపైనే, స్పెషల్ ఈవెంట్లు వీరిద్దరిపైనే ప్లాన్ చేసే స్థాయికి ఎదిగారు.
చివరకు వర్ష మాత్రం మంచి ప్రణాళికతోనే వచ్చినట్టుంది. అలా జబర్దస్త్ షోలో వచ్చిన క్రేజ్‌ను వాడుకుంటూ.. సోషల్ మీడియాలో మరింత పాపురల్ అయ్యేందుకు ప్రయత్నిస్తోన్నట్టుంది. హాట్ హాట్ అందాలతో వర్ష అందరినీ రెచ్చగొడుతుంది. బట్టలు వేసుకోకుండా.. వెరైటీగా వాటికి దుస్తులను, దుప్పట్లను అడ్డుపెట్టి ఫోటో షూట్లు చేస్తుంటుంది. అందాల ఆరబోతలో వర్ష పీక్స్‌కు చేరుకుంది. తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది. ఇందులో అర్ధనగ్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది. పైగా వీపుపై ఉన్న టాటూను ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
ఎన్నికల్లో విజయం సాధించడానికి రాజకీయపార్టీలు అనేకరకాల వాగ్దానాలను చేస్తుంటాయి. అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాయి. ఎన్నిసార్లు ఆ పార్టీలు, నాయకులు తమ మాటను నిలబెట్టుకోలేకపోయినా, గొర్రె కసాయివాడిని నమ్మినట్లు నాయకులు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్ముతూనే ఉంటారు. ప్రజల అమాయకత్వమే నాయకుల బలం. నాయకుల కల్లబొల్లి కబుర్లను నమ్మడం ప్రజల బలహీనత. అక్రమార్జనాపరులు విదేశాల్లో దాచుకున్న లక్షలకోట్ల నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కు తీసుకొచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని ప్రధాని మోడీ 2014 ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తే గుడ్డిగా నమ్మేసిన వారు కోట్లలో ఉంటారు. 2014 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరువందల హామీలను ఇచ్చారు. చంద్రబాబుకు ఉమ్మడిరాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పరిపాలించిన అనుభవం ఉన్నది.
కరెంట్ చార్జీలు తగ్గించమని ఆందోళన చేస్తున్న రైతుల మీద తుపాకీ కాల్పులు జరిపించి ముగ్గరు మరణించడానికి కారకుడైన చంద్రబాబు రైతుల రుణాలను మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన మహిళల బంగారాన్ని వెనక్కు తెచ్చి ఇస్తామని హామీ ఇస్తే పూర్తిగా నమ్మేసి గెలిపించారు! సరిగ్గా ఈ బలహీనతే నాయకుల పాలిటి వరంగా పరిణమిస్తున్నది.
Satisfaction level welfare schemes
స్వతంత్రం వచ్చిన తరువాత ఎన్నికల హామీలను సంపూర్ణంగా నెరవేర్చిన ముఖ్యమంత్రి ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే కనిపిస్తారు. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాక, ఇవ్వనటువంటి రెండు రూపాయలకు కిలో బియ్యం, ఫీజు రీయింబర్సుమెంట్, ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ లాంటి ఖరీదైన సంక్షేమపథకాలు కూడా అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదే. అవి కాంగ్రెస్ పార్టీ పధకాలు అని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గొణుగుతారు. కానీ, అవి కాంగ్రెస్ పార్టీ పధకాలు కావని, అవి పార్టీ పథకాలైతే మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు జరిపేవారని వారి అంతరాత్మలకు తెలుసు.
వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత మళ్ళీ ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చిన ఘనకీర్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పాలించినపుడు అది ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న ఆర్ధిక వనరులు వేరు. పైగా కేంద్రంలో అప్పుడు ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది విడిపోయిన పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రానికి. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నది మిత్రపక్షం కాదు. అంతకుముందు పాలించిన చంద్రబాబు నాయుడు పాలనలో పూర్తిగా దివాళా తీసి మూడు లక్షల కోట్ల రూపాయల ఋణభారాన్ని మోస్తున్న రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు మిగిల్చిన వందకోట్ల బాలన్స్ తో ఆయన పరిపాలన ప్రారంభించారు. అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని అప్పటిదాకా ఆర్ధిక శాఖామంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు కూడా ఎకసక్కేలు ఆడారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా ఏమాత్రం వెరవకుండా జగన్మోహన్ రెడ్డి సుమారు రెండు డజన్లకు పైగా సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారు. సరే, ఆయన ఎలాంటి తిప్పలు పడుతున్నారో మనకు తెలియదు కానీ కరోనా క్లిష్టసమయంలో కూడా పధకాల అమలుకు బ్రేక్ వెయ్యలేదు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గూర్చి చర్చించడం, ప్రస్తుతించడం ఇక్కడ నా అభిమతం కాదు. అయినప్పటికీ ఆయన మదిలోనుంచి పుట్టిన మూడు మహత్తరమైన ఆలోచనల గూర్చి ప్రస్తావించడం మాత్రం నేరం కాబోదు. దేశంలో ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి కూడా రాని మూడు అద్భుతమైన ఆలోచనలు, లేదా సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి మదిలో పురుడు పోసుకున్నాయి. వాటిలో ఒకటి గ్రామసచివాలయాలు. రెండవది వాలంటీర్ వ్యవస్థ. వాస్తవం చెప్పుకోవాలంటే గ్రామసచివాలయాలు అనేవి ఒక విప్లవాత్మకమైన సంస్కరణ. ఈ గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ పుణ్యమా అని నాలుగు లక్షలమంది యువతీయువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. అలా అని ఇవి ఏవో తాత్కాలికమైన ఉద్యోగాలు కావు. శాశ్వతమైన ఉద్యోగాలు. జీవిత భద్రత ఇచ్చేవి. మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం లాంటిదే నేటి గ్రామ సచివాలయ వ్యవస్థ..
ఇంజినీరింగ్ కోర్సులు చదివి, పెద్ద పెద్ద ఐటి కంపెనీలలో ఫ్రెష్ గా చేరేవారికి పదినుంచి పన్నెండు వేల రూపాయల వేతనం లభిస్తున్నది. కానీ, సాధారణ డిగ్రీ మాత్రమే చదివిన సచివాలయ ఉద్యోగులకు నెలకు పదిహేను వేలరూపాయలను చెల్లిస్తున్నారు. సుమారు ఆరువందల రకాల పౌరసేవలను ఈ సచివాలయాలు అందిస్తున్నాయి. లంచగొండితనం లేదు. ఒకటిరెండు రోజుల్లోనే పనులు జరుగుతున్నాయి. అప్పటివరకు రెవిన్యూ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ, అధికారుల కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా కాని పనులు సచివాలయ వ్యవస్థ ద్వారా జరిగిపోతున్నాయి. ఇక గ్రామ సచివాలయం అంటే నగరానికి, పట్టణానికి ఏదో ఒక మూల ఒక్కటే ఆఫీసు కాదు. ప్రతి రెండు వార్డులకు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ విధానం వలన సచివాలయ ఉద్యోగులకు కూడా పనిభారం పడదు. ప్రజలు కూడా ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
అలాగే వాలంటీర్ వ్యవస్థ. వలంటీర్ల సేవల విలువ ఏమిటో మొన్న కరోనా సమయంలో ప్రజలకు బాగా తెలిసింది. తమ పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లడం, అక్కడ వారి ఆరోగ్యపరిస్థితులు తెలుసుకోవడం, కోవిద్ రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడం, కోలుకున్న తరువాత మళ్ళీ ఇళ్లలో దిగబెట్టడం, గృహస్తులకు కావాల్సిన సరుకులు, సంబరాలు స్వయంగా తెచ్చి ఇళ్లలో ఇవ్వడం, కొత్తగా గ్రామాల్లో అడుగుపెట్టినవారిని గుర్తించడం, క్వారంటైన్ సెంటర్లకు తరలించడం లాంటి సేవలు వలంటీర్ల ద్వారా ప్రజలు కాలు కదపకుండా అందాయి. నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి పౌరసేవలు లేవు. “మూటలు మోసే ఉద్యోగాలు…వాళ్లకు పిల్లను ఎవరిస్తారు” అంటూ ప్రతిపక్ష నేత తన అక్కసును వెళ్లగక్కినా ప్రజలు మాత్రం వాలంటీర్ల సేవలను కొనియాడుతున్నారు.
ఇక చెప్పుకోవాల్సిన మూడో విప్లవాత్మకమైన పధకం రాష్ట్రంలోని సుమారు ముప్ఫయ్ఒక్క లక్షలమంది నిరుపేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చెయ్యడం. అనేక ప్రభుత్వాలు ఇళ్లస్థలాలు ఇవ్వడం, ఇళ్లను నిర్మించి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు అమలు చేశారు కానీ అవి పూర్తి ఉచితం కావు. చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన టిడ్కో ఇళ్ళు కూడా ఉచితం కావు. లబ్ధిదారులు కొంత మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. ఐదేళ్లు పరిపాలించినప్పటికీ చంద్రబాబు సంపూర్ణంగా ఆ పధకాన్ని అమలు చెయ్యలేదు. మొన్న ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిన తరువాత లబ్ధిదారుల ముఖాల్లో ఆనందాన్ని చూసిన తరువాత ఈ పధకానికి చంద్రబాబు ఎందుకు అడుగడుగునా అడ్డుపడ్డారో సులభంగా అర్ధం అవుతుంది. ఈ పధకం ద్వారా తెల్ల రేషన్ కార్డులు కలిగి, ప్రభుత్వం రూపొందించిన నియమనిబంధనలకు అనుగుణంగా ఉన్నవారికి యాభై చదరపు గజాలు కొందరికి, డెబ్బై అయిదు చదరపు గజాలు కొందరికి ఉచితంగా అందించారు. వాటిలో ఇళ్ల నిర్మాణ భాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకున్నది. అలా కాకుండా లబ్ధిదారులు తమంతట తాము నిర్మించుకుంటామంటే నిర్మాణ ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏ రకంగా చూసినా కనీసం ఒక్కొక్క లబ్ధిదారుడికి అయిదారు లక్షల రూపాయల ఆస్తిని ప్రభుత్వం సమకూర్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు. ఇటీవల ఈ వ్యాసకర్త కొన్ని ప్రాంతాల్లో ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పధకాల అమలును చూసి లబ్ధిదారులతో మాట్లాడినపుడు వారు వెలిబుచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. గత పాతికేళ్లుగా మమ్మల్ని ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వమే లేదని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులు, అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి తమ కులం వారికి, తమ అనుచరులకు, తమ బంధువులకు లబ్ది చేకూర్చారని, తొలిసారిగా కులం, మతం, పార్టీల భేదం లేకుండా పేదలు అందరికీ స్థలాలు దక్కాయని, తాము జీవితాంతం జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తుంచుకుంటామని సంతోషంతో చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి, వారు దోచుకోవడానికి తగినంత సమయం ఇచ్చి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా ఆ కమిటీలను రద్దు చేశారు. కానీ, అప్పటికే జన్మభూమి కమిటీ వ్యవస్థ అవినీతిమయంగా అపఖ్యాతి పాలైంది. ప్రతి చిన్న విషయానికి కమిటీ వారికి లంచాలు ఇవ్వడం, వారి దయాదాక్షిణ్యాలకోసం వెంపర్లాడటం, వారు సిఫార్స్ చెయ్యకపోతే జిల్లా కలెక్టర్ కూడా ఏమీ చేయలేని దుస్థితి ఉండేది. ఆ చేదు అనుభవాలతో కాబోలు…ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు అవినీతిరహితంగా తీర్చిదిద్దారు. ఎవరైనా కక్కుర్తి పడితే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. అన్నీ పత్రాలు సక్రమంగా ఉంటే కావాల్సిన సేవలు నిముషాల్లో అందుతున్నాయి. అందుకే ఈ వ్యవస్థ విజయవంతం అయింది. జగన్మోహన్ రెడ్డి దేశంలోనే మూడో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా స్థానం సంపాదించగలిగారంటే దానివెనుక పటిష్టంగా అమలు చేస్తున్న ఇలాంటి సంస్కరణలే కారణం. ఇంటిస్థలాల పంపిణీపై తెలుగుదేశం పార్టీ ఎందుకింత భయపడుతున్నదో లబ్ధిదారుల ముఖాల్లో కనిపించే చిరునవ్వులే సమాధానం చెబుతాయి.
ఎంత చేస్తున్నా అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యం. లోటుపాట్లు దొర్లుతూనే ఉంటాయి. తాత్కాలిక అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగిపోవడమే ధీరోదాత్తుల లక్షణం. అలాంటివారు తమకు ఆటంకాలను సృష్టించేవారితో కూడా విరోధాన్ని పెట్టుకోరు. మంచి గంధపు చెట్టు తనను నరికిన గొడ్డలికి కూడా సువాసన కలుగజేస్తుంది అని పెద్దల మాట!
రాహుల్ సిప్లిగంజ్ సింగర్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలను పాడాడు. అయితే ఆ పాటలను పాడింది రాహుల్ సిప్లిగంజ్ అని అంత వరకు తెలియదు. అతను ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి వచ్చాడో అప్పుడే అందరికీ తెలిసిందే. ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్ పాటలను పాడాడని. రంగస్థలం టైటిల్ సాంగ్, బొంబాట్ వంటి మాస్ బీట్లను పాడింది రాహుల్ సిప్లిగంజ్ అని.. అది ఇతనే అని బిగ్ బాస్ ద్వారానే గుర్తు పట్టారు.
Rahul Sipligunj Voice Highlight in 30 Rojullo Preminchadam Ela Promotional song
అలా అప్పటి నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఏ పాట పాడినా కూడా శ్రోతలు ఇట్టే గుర్తు పట్టేస్తున్నారు. రాహుల్ గొంతు యూనిక్‌గా ఉంటుంది. ఎలాంటి పాట పాడినా రాహుల్ వాయిస్‌ను ఈజీగానే పట్టేయొచ్చు. అలా తాజాగా రాహుల్ ఓ పాటను పాడాడు. దాంట్లో రాహుల్ పేరు ఎక్కడా కూడా లేదు. కానీ అందరూ అది రాహుల్ పాడిన పాటే అని గుర్తు పట్టేశారు. పాట మొత్తం ఒకెత్తు అయితే.. అందులో రాహుల్ వాయిస్ మరో ఎత్తు. కొన్ని కొన్ని సార్లు పాటలో నటించే వారి కంటే పాటను పాడిన వారే ఎక్కువగా వైరల్ అవుతుంటారు.
రాహుల్ ప్రస్తుతం ప్రదీప్ నటిస్తోన్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంలోని ప్రమోషనల్ సాంగ్‌ను ఆలపించాడు. ఇందులో ప్రదీప్, రష్మీ, అనసూయ, శ్రీముఖి, సద్దాం ఇలా అందరూ కనిపించారు. ఇదంతా ఓ పబ్‌లో షూట్ చేయగా.. సింగిల్ టేక్‌లోనే కానిచ్చేశారట. అయితే వీరంతా ఎంత కష్టపడినా కూడా రాహుల్ వాయిస్, ఆ గాత్రమే హైలెట్ అయింది. సినిమా పాట కంటే.. రాహుల్ గొంతు ఫేమస్ అవుతోందంటే అక్కడే అతని క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. ఇదే విషయాన్ని కొందరు అభిమానులు మీమ్స్ క్రియేట్ చేయగా.. వాటిపై రాహుల్ స్పందించాడు. నేను పాడాడని ఎక్కడా లేకపోయినా భలే గుర్తు పట్టారే అంటూ ఆశ్చర్యపోయాడు.
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆమె ఎక్కువగా షూటింగ్ సెట్స్‌లో ఉంటుంది. లేదంటే వర్కవుట్లు చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే ఈ మధ్య ఎక్కువగా యోగా సెంటర్లోనే ఉంటుంది. అన్షుక యోగా సెంటర్లో రకుల్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. యోగా గురువు అన్షుక, రకుల్ మంచి స్నేహితులు. ఇక ఈ ఇద్దరూ కలిస్తే అక్కడ రచ్చ రచ్చే అన్నట్టు ఉంటుంది వ్యవహారం.
Rakul Preet Singh about Yoga and anushka
రకుల్‌కు కరోనా సోకిన సమయంలోనూ అన్షుకే అన్నీ దగ్గరుండి చూసుకుంది. రోజూ ఆసనాలు వేయించడం, వర్కవుట్లు చేసుకోవడం వంటివి చూసింది. ఆన్ లైన్లో అన్షుక ఆసనాలు వేస్తుంటే.. రకుల్ తన క్వారంటైన్లో అవే ఆసనాలను ప్రాక్టీస్ చేసేది. అలా ఈ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహ బంధం ఉంది. అలా తాజాగా ఈ ఇద్దరూ కలిసి మరింత సందడి చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇంట్లో పాటల కచేరి ప్రోగ్రాంను పెట్టినట్టున్నారు.
వందేమాతరం అంటూ ఇద్దరూ తమ గొంతులను సవరించారు. ఇద్దరం కలిస్తే ఇలానే సందడి సందడి చేస్తామని రకుల్ చెప్పుకొచ్చింది. అయితే రకుల్ ఓ యోగా ఆసనం వేస్తూ తలకిందులుగా మారింది. ఈ ప్రపంచం కూడా ఇలా తలకిందులుగా ఉంటే తనకు ఇష్టమని రకుల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోజు మాత్రం తెగ వైరల్ అవుతోంది. రకుల్ ఇప్పుడు థ్యాంక్ గాడ్ షూటింగ్లో బిజీగా ఉంది. మొన్నీ మధ్యే శివ కార్తీకేయన్ అయలాన్ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసేసుకుంది.