ప్రస్తుత కాలంలో అక్షరాస్యత సంఖ్య బాగా పెరిగింది. అయితే ప్రతి ఒక్కరూ చదువుకోవటంతో దేశంలో నిరుద్యోగుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలనే ప్రతి ఒక్కరూ పడుతూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల కోసం ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐడిబిఐ బ్యాంక్ కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఐడిబిఐ బ్యాంక్ లో వివిధ బ్రంచులలో ఖాళీగా ఉన్న పలు ఉద్యగ ఖాళీల భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఓ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఐడిబిఐ వెల్లడించింది . మొత్తం 114 పోస్టులు ఖాళీగా ఉండగా వాటిలో వాటిలో మేనేజర్ 75 పోస్టులు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 29 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఐడిబిఐ స్పెషలిస్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 12, 2023 నిర్ణయించారు. జనరల్, EWS, OBC కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ. 1000 రుసుము చెల్లించి ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే SC/ST కేటగిరీ అభ్యర్థులకు రూ. 200 ఫీజు చెల్లించి ధరకాస్తు చేసుకోవచ్చు.
అయితే ఈ ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల దరఖాస్తు ఫారమ్‌లో, సపోర్ట్‌గా అప్‌లోడ్ చేసిన పత్రాలలో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, పని అనుభవం మొదలైన నిర్ణీత అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ప్రాథమిక స్క్రీనింగ్ కొనసాగుతుంది. ప్రిలిమినరీ స్క్రీనింగ్ తర్వాత, విద్యా అర్హతలు, పలు పత్రాల ధృవీకరణ ప్రకారం పోస్ట్‌లు/గ్రేడ్‌లకు అర్హతను నిర్ధారిస్తారు. అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు idbibank.in అధికారిక వెబ్‌సైట్ లో చూడవచ్చు.