పోస్టాఫీస్ లో మహిళల కోసం కొత్త స్కీమ్.. అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్!

దేశంలోని మహిళలకు ప్రయోజనం చేకూరేలా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పేరుతో కేంద్రం కొత్త స్కీమ్ ను అమలులోకి తెచ్చింది. మహిళల కోసం స్పెషల్ గా ఈ స్కీమ్ ను తీసుకొనిరాగా రెండు సంవత్సరాల పాటు ఈ స్కీమ్ అమలులో ఉంటుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ లో 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉండగా డిపాజిట్ చేసిన దానిపై ఎక్కువ మొత్తం వడ్డీని పొందవచ్చు.

ఈ స్కీమ్ లో ప్రస్తుతం 7.5 శాతం వడ్డి లభిస్తుండగా 2 లక్షల రూపాయల పెట్టుబడిపై రెండేళ్లపై 30,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం వడ్డీగా పొందవచ్చు. సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బ్యాంకులు, పోస్టాఫీస్ ల ద్వారా ఈ స్కీమ్ అమలవుతుండగా సమీపంలోని బ్యాంక్, పోస్టాఫీస్ ను సంప్రదించి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

బాలికలకు ప్రయోజనం చేకూరేలా సుకన్య సమృద్ధి యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న కేంద్రం మహిళల కోసం ఈ కొత్త స్కీమ్ ను అమలులోకి తెచ్చింది. ఒకేసారి 2 లక్షల రూపాయలు జమ చేసి ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగ, పరోక్షంగా ఊహించని స్థాయిలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రయోజనం చేకూరేలా మరిన్ని స్కీమ్స్ ను అమలు చేస్తే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలకు బెనిఫిట్ కలిగేలా కొన్ని స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి.